ప్రభాస్ పాత్ర చాలా చిన్నదేనట కదా

4
prabhas movie
prabhas movie

prabhas movie

తన సినిమాల విషయంలో సరైన అప్డేట్ ఇవ్వడం లేదని ఆ మధ్య ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థపై ఓ రేంజ్ లో హల్చల్ చేశారు. వారి పోరు తట్టుకోలేకే హడావిడీగా పోస్టర్ డిజైన్ చేయించి(నిజానికి ఇందులో ఏ క్రియేటివిటీ కనిపించలేదు కదా) రాధేశ్యామ్ అనే టైటిల్ తో వదిలేశారు కూడా. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సినిమా కూడా ప్రకటించారు. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ తర్వాత వరుసగా వస్తాడు అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతనో బాలీవుడ్ మూవీ చేస్తున్నట్టుగా అనౌన్స్ కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. రామాయణ గాథను పోలిన కథతో తన్హాజీ ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్షన్ లో ‘ఆదిపురుష్’ అనే టైటిల్ తో రూపొందుతున్నట్టుగా ఏకంగా టైటిల్ కూడా వచ్చేసరికి నిజంగానే అంతా షాక్ అయ్యారు కూడా. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మరింత మంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఉంటారు. అదే టైమ్ లో ఇది రామాయణంలోని హనుమంతుడి కోణంలో సాగే కథ అంటున్నారు. రావణుడు, రాముడు, సీత వంటి పాత్రలు ఉన్నా అవన్నీ పౌరాణికంగా కాక.. సాంఘికంగానే కనిపిస్తాయనే వాదన ఉంది.

అదే టైమ్ లో సినిమాలో ప్రభాస్ పాత్ర పరిమిత నిడివితో మాత్రమే ఉంటుందంటున్నారు. అంటే రాముడుగా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. కానీ ఆయనే ముఖ్యం కాదు అన్నమాట. మరోవైపు ఈ మూవీలో అత్యంత కీలకమైన ఆంజనేయుడి పాత్రను ఎవరు చేస్తున్నారు అన్న  ఆసక్తి కూడా అందర్లో ఉంది. అలాగే ఎంత కనిపించింది అనేది పక్కన బెడితే సీత పాత్ర పోషించే నటిని ఎంపిక చేయడం కూడా సవాలే. ఏదేమైనా కథ రామాయణ గాథను పోలి ఉన్నా.. పూర్తిగా సాంఘికంగా సాగే కథనమే ఉంటుందంటున్నారు. మరికొందరు ఇది ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథ అని కూడా అంటున్నారు. అయితే సినిమా పుట్టిన దగ్గర్నుంచీ‘చెడుపై మంచి గెలిచే’ కథలే చూస్తున్నాం.. అయినా వీళ్లూ అదే క్యాప్షన్ గా రావడంతో పెద్ద కొత్తదనం ఏం కనిపించడం లేదు అని పెదవి విరిచిన వారూ ఉన్నారు. ఏదేమైనా ఈ మూవీతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్ లో అదరగొట్టేయడం ఖాయం అనుకుంటున్నారు ఫ్యాన్స్.

tollywood news