ప్ర‌భాస్ స్టెప్పులు

Prabhas Steps
 సాహో సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం ముంబై వ‌ర్లీకి సంబంధించిన సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో అక్క‌డ ప్ర‌భాస్‌కు, నీల్ నితిన్ ముఖేష్‌కు మ‌ధ్య ఫైటింగ్ స‌న్నివేశాలు పూర్త‌వుతాయ‌ట‌. దాంతోకాసేపు యాక్ష‌న్‌కు రెస్ట్ ఇద్దామ‌ని అనుకుంటున్నార‌ట ద‌ర్శ‌కుడు సుజిత్‌. నెక్స్ట్ ఇమీడియేట్‌గా ప్ర‌భాస్‌, పూజా హెగ్డే మ‌ధ్య రొమాంటిక్ సాంగ్స్ ని తీద్దామ‌ని అనుకుంటున్నార‌ట‌. ఇంకా మూడు పాట‌ల‌ను తెర‌కెక్కించాల్సి ఉంది. వాటిలో ఏదో ఒక పాట‌ను ముందు తీయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వినికిడి. యువీ క్రియేషన్స్ 300 కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ రూపొందుతోంది. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `బాహుబ‌లి` సీక్వెల్స్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. శ్ర‌ద్ధా క‌పూర్ నాయిక‌. నీల్ నితిన్ ముఖేష్‌, ఎవ్లిన్ శ‌ర్మ‌, లాల్‌, అరుణ్ విజ‌య్‌, శ్ర‌బంతి చ‌ట‌ర్జీ, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, సాషా చెత్రి, తిన్ను ఆనంద్‌, న‌వీన్ వ‌ర్మ గ‌ణ‌ప‌తిరాజు, ఆదిత్య శ్రీవాస్త‌వ‌, శివ‌కృష్ణ‌, ముర‌ళీ శ‌ర్మ తదిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. వంశీ, ప్ర‌మోద్ క‌లిసి నిర్మిస్తున్న సినిమా ఇది.

Related posts:

14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?
అనుష్కకే దిక్కు లేదు.. కీర్తి సురేష్ ను పట్టించుకుంటారా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *