మరో 30 రోజులైనా ఆగుతాడట.. కానీ

pradeep no to OTT

అరంగేట్రం అనుకున్నదానికంటే ఆలస్యం అయితే ఆ ఫ్రస్టేషన్ వేరే ఉంటుంది. పైగా వెండితెరపై తమను తాము చూసుకోవాలనే కోరికకు కొన్ని వైరస్ లు బ్రేక్ వేస్తే ఇంకే చెప్పేదేముందీ. ప్రస్తుతం యాంకర్ మాచిరాజు ప్రదీప్ పరిస్థితి అలాగే ఉంది. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ప్రదీప్.. బుల్లితెరపై మాత్రం స్టార్ యాంకర్ గా రాణిస్తున్నాడు. అలాంటి అతని ఇమేజ్ ను ఎక్స్ పాండ్  చేసుకునేందుకు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఈ మూవీలోని ఒకే పాటతో ఓవర్ నైట్ అటెన్షన్ తెచ్చుకున్నాడు కూడా. దీంతో ఇది ఏ సినిమా అంటూ ఒక్కసారిగా ప్రదీప్ సినిమా వైపు చూశారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేటైటిల్ తో వస్తోన్న ఈ మూవీ నుంచి వచ్చిన ఇతర పాటలు సైతం ఆకట్టుకున్నాయి. మామూలుగా మార్చి 25న విడుదల అనుకున్నారు. కానీ అంతకు మూడు రోజుల ముందే లాక్ డౌన్ అనౌన్స్ అయింది. అది కాస్తా రెండు నెలలుగా ఎక్స్ టెండ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో పాటు మరికొన్ని సినిమాల గురించి నిరంతరం వార్తలు వస్తున్నాయి.

అదేమంటే.. ఈ సినిమాలు ఇక థియేటర్స్ లో విడుదల కావు.. ఓటిటి ప్లాట్ ఫామ్ లోనే రిలీజ్ అవుతాయి అని. కానీ అందుకు ప్రదీప్ ఏ మాత్రం ఇంట్రెస్ట్ గా లేడట. అంతే కాక.. తన సినిమా ఇంకా నెల రోజులైనా ఆగుతుంది కానీ.. ఓటిటిలో మాత్రం విడుదల చేయడానికి అస్సలు ఒప్పకోను అంటున్నాడట. ఇక ప్రదీప్ సరసన ఈ చిత్రంలో ప్రదీస్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. మున్నా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మొత్తంగా కాస్త అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమాకు కరోనా దెబ్బ గట్టిగానే తగిలింది. కానీ థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనే క్లారిటీ లేకపోయినా.. ప్రదీప్ ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నాడో కానీ.. ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది తెలుసుకునేది మాత్రం ఖచ్చితంగా థియేటర్స్ లోనే అని తేల్చేస్తున్నారు. అవున్లే.. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టేది నిర్మాతలు కానీ నటులు కాదు కదా.. ఎన్నైనా చెబుతారు.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *