పోస్ట్ లాక్ డౌన్.. ఫస్ట్ ప్రాజెక్టు

Praneeth Pranav Knightwoods

అసలే కరోనా కలకలం.. ఎవరి నుంచి ముప్పు వస్తుందోననే భయం.. ఫలితంగా ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేని దుస్థితి.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ హైదరాబాద్లో ఓ నిర్మాణ సంస్థ ఒక బడా లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటినీ ప్రారంభించడమంటే ఆషామాషీ విషయమేం కాదు. ఇంత ధైర్యంగా కొత్త నిర్మాణాన్ని మొదలెట్టాలంటే రియల్ మార్కెట్ అయినా మెరుగ్గా ఉండాలి. లేక, ఆ బిల్డర్ కు మార్కెట్లో మంచి పేరుండి, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా విల్లాల్ని అమ్ముకోవచ్చనే ధీమా ఉండాలి. ఇక్కడ రెండో విషయమే కరెక్టు అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా?

ప్రణీత్ గ్రూప్ కి హైదరాబాద్ రియల్ రంగంలో మంచి పేరుంది. కరోనా వచ్చినా, దాన్ని అమ్మమ్మ వచ్చినా సకాలంలో ఇళ్లను బయ్యర్లకు అందిస్తుందన్న ప్రఖ్యాతిగాంచింది. అందుకే, కోవిడ్ పరిస్థితుల్ని లెక్క చేయకుండా కొత్త విల్లా ప్రాజెక్టును బుధవారం బీరంగూడలో ఆరంభించింది. సుమారు 30 ఎకరాల్లో ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ అనే నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో మొత్తం 450 విల్లాల్ని నిర్మిస్తారు.  ఇప్పటికే అదే ఏరియాలో మూడు విల్లా ప్రాజెక్టులను పూర్తి చేసిన ట్రాక్ రికార్డును ఈ సంస్థ సొంతం చేసుకున్నది. ప్రణీత్ ప్రణవ్ హోమ్స్, ప్రణీత్ గ్రీన్ ఫీల్డ్స్, ప్రణీత్ ప్రణవ్ కౌంటీ అనే మూడు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా విల్లా ప్రాజెక్టులో కొనుగోలుదారులకు కావాల్సిన సమస్త సదుపాయాల్ని పొందుపర్చింది. క్లబ్ హౌజ్ కు పెద్దపీట వేసింది. చిన్నారులు, యువత, మహిళలు, పెద్దలు.. ఇలా ప్రతిఒక్కరికీ అవసరమయ్యే విధంగా ఆధునిక సౌకర్యాల్ని కల్పించింది. మరెందుకు ఆలస్యం.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఈ విల్లా ప్రాజెక్టులో మీకు నచ్చిన ఇంటిని వెంటనే కొనుగోలు చేయండి.

Praneeth New Projects

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *