రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు

President Ramnath Kovind Responds on Disha Case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. ఇప్పుడు దేశం మొత్తం దీనిపైన చర్చిస్తుంది. ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేయగా, రేపిస్టులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులపై దయ చూపాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. కొన్ని కీలక కేసుల విషయంలో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటీషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.

దేశ వ్యాప్తంగా జరగుతున్న హత్యాచార ఘటనపై రాష్ట్రపతి మాట్లాడుతూ..బాలికలు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారం..హత్య, హింసలు వంటి ఘటనల కేసుల్లో దోషులు క్షమాభిక్ష కోసం పిటీషన్లు పెట్టుకుంటున్నారనీ.. కానీ రేపిస్టులపై దయా చూపాల్సిన అవసరం లేదని అన్నారు. రాజస్థాన్ లోని ఓ మహిళా సదస్సులో రాష్ట్రపతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్భయ కేసులో ఓ నిందితుడు క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నారనీ.. కానీ భయకరంగా ప్రవర్తిస్తు మహిళల జీవితాలను చిదిమేస్తున్న రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదన్న రాష్ట్రపతి వారు ఎటువంటి పరిస్థితుల్లో క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నారు అనే అంశంపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. దీంతో మహిళలపై రేప్ లకు పాల్పడుతు..హత్యలు చేస్తున్నవారికి కఠిన శిక్షలు పడాల్సిన అవసరముందనే అభిప్రాయాన్ని రాష్ట్రపతి వెల్లడించారు. కానీ క్షమాభిక్ష ఎందుకు కోరుకుంటున్నారనే అంశాన్ని పరిశీలించాలనీ, దానిపై చర్చ జరగాలని పేర్కొన్నారు. ఏది ఏమైనా రాష్ట్రపతి తో సహా ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని పేర్కొంటున్నారు.

President Ramnath Kovind Responds on Disha Case,disha  muder, encounter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *