యువ క్రికెటర్ పృథ్వీషా పై నిషేధం

Spread the love

PRITHVI SHAW SUSPENDED

  • డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడంతో బీసీసీఐ చర్యలు
  • 8 నెలలపాటు అన్ని ఫార్మాట్లకూ దూరం కానున్న షా

టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అతడిపై నిషేధం విధించింది. 8 నెలలపాటు ఏ ఫార్మాట్లోనూ ఆడకుండా చర్యలు తీసుకుంది. సయ్యద్‌ ముస్తాఖ్‌ అలీ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మ్యాచ్‌ ఆడుతుండగా అతడికి డోపింగ్‌ పరీక్షలు నిర్వహించారు. అతడు నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. షా మూత్రం నమూనాల్లో  ‘టర్బుటలైన్‌’ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు  అధికారులు గుర్తించారు.  దీంతో డోపింగ్‌ నిబంధనల ఉల్లంఘన కింద పృథ్వీ షాపై నిషేధం విధించారు. అతడిపై మార్చి 16 నుంచి నవంబర్‌ 15 వరకు ఈ నిషేధం కొనసాగుతుంది. టర్బుటలైన్‌ సాధారణంగా దగ్గు మందులో ఉంటుంది.  అనుకోకుండా తాను దగ్గు మందు తీసుకోవడంతో ఆ ఉత్ప్రేరకం తన శరీరంలో ఉండిపోయిందని షా వివరణ ఇచ్చాడు. ‘‘ఇప్పటికే గాయంతో జట్టులో చోటు కోల్పోయాను. ఇప్పుడీ వార్త నన్ను కుదిపేసింది. చికిత్స కోసం మినహాయింపు ధ్రువపత్రం తీసుకోకుండా తప్పుచేశా. ఆటగాళ్లు చిన్న మెడిసిన్‌ తీసుకొనేప్పుడైనా ఎంతో జాగ్రత్తగా ఉండాలని నా సంఘటన చెబుతోంది. క్రికెట్‌ నా జీవితం. టీమిండియా, ముంబయికి ఆడటం కన్నా నాకేదీ ముఖ్యం కాదు. జలుబు చేయడంతో దగ్గు మందు తీసుకున్నా. గాయం బారిన పడి స్వదేశానికి వచ్చి త్వరగా క్రికెట్‌ ఆడాలన్న తొందరలో ప్రొటోకాల్‌ ఉల్లంఘించా’’ అని షా వివరించాడు.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *