ప్రియాంక హత్య కేసులో నలుగురు అరెస్టు

Spread the love

PRIYANKA CASE SOLVED

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నారాయణపేటకు చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ పాషా ఈ కేసులో ప్రధాన నిందితుడు అని నిర్ధారించారు. అతడితోపాటు లారీ క్లీనర్, మరో ఇద్దరు కలిసి ప్రియాంకపై అత్యాచారం చేసి, హత్య చేశారని విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి లారీలో ఎక్కించి చటాన్ పల్లి బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి అక్కడ పడేశారు. తర్వాత కిరోసిన్ పోసి మృతదేహాన్ని కాల్చివేసినట్టు గుర్తించారు. ప్రస్తుతం అరెస్టు చేసిన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

CRIME NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *