Priyanka Reddy Colony People
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం మరియు హత్య ఘటనలో తమకు సానుభూతి అవసరం లేదని, నిందితులను శిక్షించేందుకు చూడాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నక్షత్ర విల్లా వద్ద కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ప్రియాంక రెడ్డి నివాసముంటున్న కాలనీవాసులు గేటుకు తాళం వేసి పరామర్శించడానికి వచ్చేవారిని పరామర్శలు వద్దని వెనక్కి పంపిస్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలనీలో ఉన్న పోలీసులు సైతం బయటకు పంపించి గేటు తాళం వేసిన కాలనీవాసులు కాలనీవాసులు మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. సత్వర న్యాయం చేయాలి, ఎవరి సానుభూతి పరామర్శ అవసరం లేదని డిమాండ్ చేస్తున్న కాలనీవాసులు, ప్రభుత్వానికి చేతకాకపోతే ఆ నలుగురిని తమకు అప్పగించమని చెబుతున్నారు.
ఇప్పటివరకు #సీఎంకేసీఆర్ మాట్లాడకపోవడం దురదృష్టకరమని, ఆడపిల్లల భద్రత కోసం పెద్దపీట వేస్తున్నామని, నెలవంక చూస్తే గుడ్లు బికేస్ అని పెద్దపెద్ద మాటలు చెప్పిన కేసీఆర్ వెనక కారణం ఏంటి అని శ్రీనివాసులు నిలదీస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ కాలనీలోనే ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. కాలనీ గేటుకు లోపలి నుంచి తాళాలు వేసిన కాలనీ వాసులు తమ ప్రాంతానికి పోలీసులు, రాజకీయ నాయకులు రావద్దని బోర్డులు పెట్టేశారు. గేటు వద్దే బైఠాయించి స్థానికులను మాత్రమే లోపలికి పంపుతున్నారు. కాలనీ వాసుల డిమాండ్ తో అక్కడ ఉన్న పోలీసులు, కొందరు నాయకులు వెనక్కి వెళ్లిపోయారు. కొందరు సీపీఎం నేతలు ఈ రోజు ఉదయం అక్కడకు వచ్చి, స్థానికులతో పాటే కూర్చొని నిరసనలో పాల్గొన్నారు. ఆ కుటుంబానికి సానుభూతి వద్దని, వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రియాంక రెడ్డి హత్య కు సంబంధించిన ఆగ్రహజ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి.