ఎన్ కౌంటర్ లతో తప్పుడు సంకేతాలు

Pro Haragopal Against Disha Case Encounter

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ సంచలనంగా మారింది. నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళలకు భద్రత లేదని భావించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య, నిందితులను ఎన్కౌంటర్ చేయడం తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది. ఇక ఈ ఘటనపై దేశం మొత్తం దాదాపుగా హర్షం వ్యక్తం చేస్తుంటే పలువురు విమర్శిస్తున్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకోవటం సమాజానికి మంచిది కాదని అంటున్నారు.

దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై ప్రొఫెసర్ హరగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే నిగ్రహం కోల్పోవడం సరికాదని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చట్టాన్ని కాదని శిక్షలు వేస్తే కొంత న్యాయం జరిగిందని భావించవచ్చని… కానీ, ఎన్ కౌంటర్లు చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని అన్నారు. దిశ హత్య అత్యంత ఘోరమైన ఘటనేనని… అయితే, నేరాన్ని రాజ్యమే హత్య చేయడం సరికాదని చెప్పారు. ఇలాంటి ఘటనల్లో నేరాన్ని కోర్టులో రుజువు చేసి, అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేయవచ్చని తెలిపారు. ప్రజలు కోరుకుంటున్నారు కదా అని ఎన్ కౌంటర్లు చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

Pro Haragopal Against Disha Case Encounter,disha  murder, encounter, shad nagar , chatan palli bridge , police , cp sajjanar, Haragopal,Priyanka Reddy Case Encounter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *