ధనుష్ కు ఫ్యాన్స్ ను సెగ

5
problem to dhanush fans
problem to dhanush fans

problem to dhanush fans

కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ధనుష్ ఒకడు. ఏ పాత్రైనా చేయలగ సత్తా ఉన్న ఏకైక సౌత్ స్టార్ కూడా అతనే అంటే అతిశయోక్తి కాదు. టీనేజ్ కుర్రాడి నుంచి అరవైయేళ్ల ముసలి పాత్ర వరకూ ధనుష్ అద్భుతంగా చేయడమే కాదు మెప్పిస్తాడు కూడా. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో రాంఝనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా సొంతం చేసుకున్న ప్రతిభ అతని సొంతం. ఇప్పుడు కూడా ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. సౌత్ మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ధనుష్ కు ఇప్పుడు అదే అభిమానుల నుంచి సెగ మొదలైంది. అది కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ వల్ల కావడం విశేషం. ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న చిత్రం ‘జగమే తంతిరమ్’. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తోన్న సినిమా ఇది. ఇంతకు ముందే ధనుష్ మామ సూపర్ స్టార్ రజినీకాంత్ కు పేటాతో సూపర్ హిట్ ఇచ్చాడు కార్తీక్. ఇప్పుడు అల్లుడుతో అత్యంత భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. మళయాల బ్యూటీ ఐశ్వర్య లెక్ష్మి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని కూడా ఓటిటిలో విడుదల  చేస్తారు అనే ప్రచారం మొదలైంది.

మొదట్లో ఈ ప్రచారాన్ని చాలామంది లైట్ తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే సూర్య నటించిన సూరరై పోట్రు(ఆకాశమే నీ హద్దురా) ఓటిటి విడుదలకు లైన్ క్లియర్ అయిందో.. అప్పటి నుంచి ఈ సినిమాను కూడా ఓటిటిలో రిలీజ్ చేస్తారు అని ప్రచారం ఊపందుకుంది. అయితే తమ అభిమాన హీరో పెద్ద సినిమాను థియేటర్స్ లోనే చూస్తాం.. ఓటిటిలో విడుదల చేస్తే ఊరుకోం అంటూ ధనుష్ ఫ్యాన్స్ ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో గొడవ మొదలుపెట్టారు. దీనికి అతి తక్కువ టైమ్ లోనే లక్షల్లో మద్ధతు వచ్చింది. దీంతో నిర్మాతలు కూడా సినిమాను ఓటిటిలో కాకుండా థియేటర్స్ లోనే విడుదల చేస్తాం అని ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నారట. కానీ విషయం ఓపెన్ గా చెప్పడం లేదు. అంటే నిజంగానే ఈ సినిమాను ఓటిటిలో వదలాలనుకున్నారేమో కదా. ఏదేమైనా ఫ్యాన్స్ దెబ్బకు ఎవరైనా దిగిరావాల్సిందే.

cinema news