సినిమా వాళ్లు ఏం పాపం చేశారో

problems for cinema

కరోనాతో ప్రపంచం అతలాకుతలం అయింది. ఒక్కో దేశం ఒక్కో రకం అని కాకుండా అన్ని దేశాలూ ఒకేరకంగా ఇబ్బందులు ఫేస్ చేశాయి. ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ రంగం మాత్రం అన్ని దేశాల్లో కుదేలైపోయింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో మనదేశంలో కూడా వినోద పరిశ్రమ రెండు నెలలుగా మూతపడిపోయింది. థియేటర్స్ మాత్రమే కాదు.. షూటింగ్స్ కూడా లేవు. దీంతో ప్రధానంగా  ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగు సినిమా పరిశ్రమనే నమ్ముకుని జీవిస్తోన్న దాదాపు యాభై వేల మంది వరకూ ఉపాధి లేకు వీధిన పడ్డారు. సరే… దేశ క్షేమం కోసం కొన్ని బాధలు భరించాల్సిందే అనుకుని ఎవరికి వారు అడ్జెస్ట్ అవుతూ అన్ని బాధలూ భరించారు. అయితే ఎన్నాళ్లైనా కరోనాకు విరుగుడు లేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ఎన్నాళ్లని ఈ లాక్ డౌన్ కొనసాగించాలి. అందుకే దశల వారీగా ఎత్తేస్తూ.. ఒక్కక్కటిగా అన్ని పరిశ్రమలకూ విడుదల ప్రకటిస్తున్నారు. అయితే జన సందోహం ఎక్కువగా కనిపించే సినిమా పరిశ్రమపై మాత్రం నిబంధనలు కొనసాగుతున్నాయి. అయినా ఓకే అనుకున్న వారికి తాజాగా తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు షాక్ ఇచ్చేస్తున్నాయి. ఇంత చేస్తే మేం మాత్రం ఏం పాపం చేశాం అనేలా పరిశ్రమ నుంచి భావనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు చెప్పినట్టు కొన్ని అంశాల్లో లాక్ డౌన్ పాటించాల్సిందే. అందులో జనసమ్మర్థం ఎక్కువగా ఉండే థియేటర్స్, షూటింగ్స్ కూడా వాటి పరిధిలోకి వస్తాయి. అయితే ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనల్లో అనేక పరిశ్రమల గురించి మాట్లాడారు. కానీ దేశంలో అతిపెద్దదైన వినోద పరిశ్రమగా ఉన్న సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరూ మాట్లాడలేదు. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాలు ఏకంగా బస్ లను కూడా ప్రారంభించింది. పైగా బస్సుల్లో ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఒకప్పుడులాగానే అన్ని సీట్స్ లో ప్రయాణికులు కూర్చోవచ్చు. కానీ చాలాకాలంగా ఏదో ఒక ప్రయాణాలకు ఎదురుచూస్తోన్నం కేవలం సీట్స్ లేవనే కారణంగా బస్ ఎక్కకుండా ఆగరు. ఎంత చెప్పినా వినరు. నించోనైనా, ఫుట్ బోర్డ్  ప్రయాణమైనా చేస్తారు.

అంటే ప్రమాదం పరిధి విస్తృతం అవుతుంది. పైగా వైరస్ కాంటాక్ట్స్ ను గుర్తించడం కూడా చాలా కష్టం అవుతుంది. అలాంటి బస్ లు ఓపెన్ చేసిన ప్రభుత్వాలు.. సీట్స్ లేకపోతే వేరే టికెట్ ఇవ్వని సినిమా థియేటర్స్ ను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. థియేటర్స్ పైనే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇక కొన్నాళ్ల క్రితం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కూడా ఇప్పట్లో సినిమా షూటింగ్ లకు అనుమతి ఉండదు. అలాగే థియేటర్స్ కూడా ఓపెన్ కావు అనేలా సంకేతాలిచ్చాడు. కానీ అప్పుడు బస్ లు కూడా ఆ పరిధిలో ఉన్నాయి. మరి ఇప్పుడు బస్ లు ప్రారంభించారు కదా. సినిమా థియేటర్స్ మాత్రం ఎందుకు ఓపెన్ చేయరు అనే ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సినిమా థియేటర్ అనగానే సాధారణ జనం వెళ్లి ఎంటర్టైన్ అయ్యే విధంగానే అనుకుంటున్నారు. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ వెనక ఎన్ని వేల కుటుంబాల ఉపాధి ఉందో కూడా అర్థం చేసుకోవాలి. వారందరినీ మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నట్టుగానే భావించాలి. అసలే సినిమా పరిశ్రమలో అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువ. అలాంటి వారి బాధలు ఎవరూ పట్టించుకోరు. అందుకే ప్రభుత్వం ఏదోవిధంగా చొరవ తీసుకుని కాస్త కఠినమైన నిబంధలు సూచిస్తూ అయినా థియేటర్స్ ను ఓపెన్ చేస్తే మంచిది. ఎలాగూ సినిమా పరిశ్రమ నుంచి కూడా ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి ఆదాయం భారీగానే ఉంటోంది కదా.. ? కొన్ని రోజులుగా థియేటర్స్ విషయంలో మూడు షోస్ కు అనుమతి ఇస్తే మంచిది అనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి అభిప్రాయాలతో పాటు పరిశ్రమ, పోలీస్, ఇతర ప్రధాన వ్యక్తుల ఒపీనియన్స్ ను కూడా తీసుకుని వెండితెరను వెలిగిస్తే మంచిది. లేదంటే ఆ కార్మికుల జీవితాలు మరింత దుర్భరం అవుతాయి. ఇక ఈ విషయంలో సినిమా పరిశ్రమ పెద్దలు కూడా ప్రభుత్వ పెద్దల్లో కాస్త గట్టిగా కదలికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి.

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *