దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ఎలా జరిగిందంటే..

process of disha case encounter

దిశ హంతకులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ ప్రజలు ఈ ఎన్ కౌంటర్ ను సమర్ధిస్తున్నారు. పోలీసులను ఓ రేంజ్ లో పొగుడుతున్నారు. తెలంగాణ పోలీసులకు జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు.

ఇక ఈ ఎన్కౌంటర్ ఘటన ఎలా జరిగిందంటే… శంషాబాద్ లోని చటాన్ పల్లి వద్ద ఈ ఉదయం తెల్లవారుజామున దిశను ఎక్కడైతే చంపారో అక్కడే సీన్ రికన్ స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు నలుగురు నిందితులను అక్కడికి తీసుకెళ్లారు.ఈ సమయంలోనే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతోపాటు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా దిశను కాల్చేసిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి 300 మీటర్ల దూరంలో పొలాల మధ్యలో నలుగురి శవాలు కొద్దిదూరం తేడాలో పడి ఉన్నాయి. స్పాట్ లోనే నిందితుల మృతదేహాలకు ఆర్టీవో ఆధ్వర్యంలో నలుగురు తహసీల్దార్లు పంచనామా నిర్వహించారు. ఎన్ కౌంటర్ జరిగిన చుట్టూ నలుగురి శవాలు పడి ఉన్న ప్రదేశంలో పోలీసులు ‘డునాట్ క్రాస్ ’ ట్యాగ్స్ పెట్టి ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కేసు చాలా కీలకమైన కేసు కావడంతో అక్కడే పంచనామా నిర్వహించేలా చేశారు పోలీసులు. ఇక ఘటనా స్థలంలో 12 బుల్లెట్లను పోలీసులు సేకరించారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు జరిగినట్టుగా తెలిపారు.

process of disha case encounter,behind of disha encounter,disha  muder, encounter, shad nagar , chatan palli bridge , police , cp sajjanar,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *