ఎన్కౌంటర్ పై కోదండరాం స్పందన ఇది!

Prof.Kodandaram Reacts On Disha Encounter

దిశ గ్యాంగ్ రేప్, హత్యా ఘటన ఎంత ప్రకంపనలు సృష్టించిందో ఇప్పుడు నిందితుల ఎన్కౌంటర్ కూడా దేశ వ్యాప్తంగా అంతే ప్రకంపనలు సృష్టిస్తుంది.రాష్ట్రంలో.. దేశంలో.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింసపై తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఈ అఘాయిత్యాలను నిరోధించడానికి ఎన్ కౌంటర్లు పరిష్కారం కాదన్నారు. ఎన్ కౌంటర్లతో సమస్యలు తీరవని చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో టీజేఎస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరంగల్ లో యువతిపై జరిగిన హత్యాచార ఘటనపై మాట్లాడారు. అత్యాచారాలు, హత్యలు తదితర నేరాలను అరికట్టాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. వరంగల్ యువతిపై జరిగిన హత్యాచార ఘటనపై వెంటనే విచారణ జరిపించాలన్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దిశ తరహా ఘటనలు మళ్లీ జరుగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణలో మహిళా కమిషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసి భాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం మంచిది కాదన్నారు.

Prof.Kodandaram ReactsOnDishaEncounter  ,#DishaMurder,#AccusedEncounter,#TJS,#Kodandaram,#Encounter ,#RoundTable,#eeting#Hanamkonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *