కామన్‌ మ్యాన్‌ ఎమోషన్‌ ఇలాగే ఉంటుంది

Public express happiness over encounter
ఒక్క ప్రాణం పోయిందని తెలిస్తేనే అయ్యో అంటాం… కానీ ఆ నలుగురు ప్రాణాలు పోతే మాత్రం ఆహా అంటున్నారు. దిశ హత్యాచార ఘటనలో సామాన్యుడి రియాక్షన్‌ ఇది. నిందితుల ఎన్‌కౌంటర్‌ వార్త తెలియగానే- మంచి పని చేశారనే మాట ముక్తకఠంతో వినిపించింది. ఇక నిన్నటిదాకా పోలీస్‌ల వైఖరిపై విమర్శలు కురిపించిన వారే ​ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సాహో సజ్జనార్‌… శభాష్‌ పోలీస్‌ అంటూ ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం వద్ద పోలీస్‌ల మీద పూల వర్షం కురిపించారు. ఖాకీ ​దుస్తుల్లో కనిపించిన వారందరినీ భుజాల మీదకెత్తుకున్నారు. మహిళ కానిస్టేబుల్స్‌కి స్వీట్స్‌ తినిపించి తమ ఆనందాన్ని పంచుకొన్నారు చటాన్‌పల్లి బ్రిడ్జ్‌ దగ్గరకు వచ్చిన ​ప్రజలు. ఇక నిన్నటిదాకా బూడిద కుప్పగా కనిపించిన దిశను తగలబెట్టిన ప్రదేశాన్ని ఎన్‌కౌంటర్‌ తర్వాత పూలతో అలంకరించారు. ఇలాంటివి చూసినప్పుడే మనం ​మనుషుల్లమన్న విషయం మళ్లీ గుర్తుకు వస్తుంది. ఎండ్‌ ఆఫ్‌ ద డే ఎమోషన్సే మనల్ని ప్రభావితం చేస్తాయని… అవి ఇంకా అలాగే ఉన్నాయని అనిపిస్తోంది. ఎంత సోషల్‌ ​మీడియాలో ఏజ్‌లో బతుకుతున్నా ఆవేశం వచ్చినా- ఆనందం వచ్చినా కామన్‌ మ్యాన్‌ ఎమోషన్‌ మాత్రం మారదని గట్టిగా ఫిక్సైపోవచ్చనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *