పుల్వామా దాడి సూత్రధారి హతం

Spread the love

PULWAMA KEY MIND KILLED

  • ఎన్ కౌంటర్ లో మృతిచెందిన అహ్మద్ భాయ్
  • దాడికి పేలుడు పదార్థాలు సమకూర్చింది అతడేనని అనుమానం

పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది ముదాసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్ హతమైనట్టు తెలుస్తోంది. త్రాల్‌లోని పింగ్లిష్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 23 ఏళ్ల ఎలక్ర్టీషియన్‌ మహ్మద్‌ భాయ్‌ కూడా ఉన్నాడని అధికారులు వెల్లడిం‍చారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురి మిలిటెంట్ల మృతదేహాలు దగ్ధమయ్యాయని, గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, వారిని గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు పింగ్లిష్‌ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. తనిఖీలు జరుపుతుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతా బలగాలపైకి కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు జైషే ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయని అధికారులు తెలిపారు. హతుల్లో ఒకరిని ముదాసిర్‌ అహ్మద్ ఖాన్‌గా పోలీసులు భావిస్తున్నారు. కాగా, పుల్వామాలో ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మరణించిన ఘటన వెనుక మహ్మద్‌ భాయ్‌ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.  జైషే మానవ బాంబు పాల్పడిన ఈ దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్‌ సమకూర్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ట్రాల్‌ ప్రాంతంలోని మిర్‌ మొహల్లా నివాసైన ఖాన్‌ పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని చెప్పారు. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్‌ అహ్మద్‌ దార్‌ నిత్యం ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్‌ కోర్సు చేశాడు. కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఖాన్‌ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *