#Punarnavi Bhupalam gets engagment#
నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి భూపాలానికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. టీవీ షోలతోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది ఈ బ్యూటీ. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటో షేర్ చేస్తూ.. ‘చివరకు.. ఇది జరుగుతుంది’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసింది. ఫొటోను గమనిస్తే పునర్నవికి ఎంగేజ్ మెంట్ జరిగిందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఫొటోలో ఓ వ్యక్తి ఆమె వేలుకు డైమండ్ రింగ్‌ను తొడిగినట్టు ఉంది. దీంతో ఆమె పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పునర్నవికి ఎంగేజ్ మెంట్ జరిగిందని అమె అభిమానులు అంటున్నారు. కాబోయే భర్తను చూపించాలంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.
పునర్నవి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్ యేనా? లేకా మరే వ్యక్తా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉంగరం తొడిగిన వ్యక్తి రాహుల్ అయ్యి ఉంటాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. దానికి కారణం వాళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రియే. బిగ్ బాస్ హౌజ్ లో వాళ్లిద్దరూ చాలా క్లోజ్ గా ఉండటం, బయట కూడా తరుచుగా కలుస్తుండటం వల్ల రాహుల్ అయ్యే ఉంటాడని పలువురు అంటున్నారు. గతంలో చాలాసార్లు మీడియా ఈ జంటను ప్రశ్నించగా తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని బదులిచ్చారు. పునర్నవి ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో త్వరలోనే తెలుస్తుంది.