ఈ టైమ్ లో జనగణమన  అవసరమా పూరీ?

Puri Janaganamana

డాషింగ్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్ ఉన్న దర్శకుడు పూరీ జగన్నాథ్. ఒకప్పుడు వెండితెరపై మాస్ మీనింగ్ ను మార్చేసిన దర్శకుడు. రాముడు మంచి బాలుడు టైప్ హీరోలను ఇడియట్స్ గా మార్చినవాడు. పోకిరీలుగా చూపించినవాడు. అయితేనేం.. అతని డైరెక్షన్ లో నటించాలని అప్పట్లో ప్రతి హీరో కోరుకున్నాడు. అయితే ఆ కోరికలు ఇప్పుడు వారిలో లేవు. ఎందుకంటే పూరీ ట్రాక్ తప్పాడు. ఒకే కథతో సినిమాలు చేస్తున్నాడు. బ్యాంకాక్ ‘భాయ్’.. హైదరాబాద్ లో హీరో. లేదంటే పోకిరి హీరో.. ఆడంటే పడని హీరోయిన్.. ఇదే టైప్ కథలతో ఇబ్బంది పెట్టాడు. మధ్యలో టెంపర్ చూపించినా.. అది అతని కథ కాదు. ఇక రీసెంట్ గా తనశైలిలోనే ఇస్మార్ట్ శంకర్ అంటూ సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ ఊపులో రౌడీఫెలో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. పూరీ, చార్మి కనెక్ట్స్ తో పాటు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ చిత్రం ప్యాన్ ఇండియన్ లెవెల్లో మొదలైంది. ఈ లోగా లాక్ డౌన్ వచ్చి పడటంతో షూటింగ్ ఆగిపోయింది. పూరీ స్పీడ్ కు ఈ మూవీ రేపో మాపో మొదలైనా ఆశ్చర్యం లేదనుకోండి. ఫైటర్ లేదా లైగర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ మూవీ ఇలా ఉండగానే ఇప్పుడు పూరీ ‘జనగణమన’ గురించి మాట్లాడటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మామూలుగా స్టార్ హీరోలైనా.. దర్శకులైనా.. ఓ సినిమా చేస్తున్నప్పుడు మరో ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం వెరీ రేర్. అది కూడా ఈ సినిమాపై నమ్మకం లేని టైమ్ లో వినిపిస్తాయి.

అలాంటిది ఇంకా పూర్తి స్థాయిలో షూటింగే మొదలు కాని సినిమా కంటే అసలు ఉంటుందా లేదా తెలియని ప్రాజెక్ట్ గురించి వార్తల్లో నిలవడం విశేషం అనే చెప్పాలి. పూరీ జగన్నాథ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో ‘జనగణమన’ అనే దేశభక్తి చిత్రం వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.  కానీ మధ్యలో వీరి టర్మ్స్ పాడయ్యాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. పైగా ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని తనే చాలాసార్లూ చెప్పుకున్నాడు పూరీ. అయితే కావొచ్చు. కానీ విజయ్ దేవరకొండ సినిమా చేస్తూ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో అతను ఇప్పుడు చేస్తోన్న మూవీపై కొంత క్రేజ్ తగ్గుతుందనేది నిజం. కాకపోతే షూటింగ్ కు ఇంకా టైమ్ ఉంది. సినిమా రిలీజ్ అయ్యే సరికి చాలా టైమ్ పడుతుందనే ధైర్యంతో మాట్లాడి ఉండవచ్చేమో. కానీ ఇదే సందర్భంలో మరో విషయమూ అర్థమవుతుంది. ఇన్ డైరెక్ట్ గా మహేష్ బాబుకు ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి హింట్ ఇస్తున్నాడేమో.. అని కూడా అనిపిస్తోంది. ఏదేమైనా ఫైటర్ ను పక్కన బెట్టి.. అసలు మేటర్ లో లేని జనగణమన అనడం చిత్రంగానే ఉంది.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *