ముంబై ప్రియుడుగా  పూరీ జగన్నాథ్

2

Puri loves Mumbai

పూరీ జగన్నాథ్.. డాషింగ్ డైరెక్టర్ గా తిరుగులేని క్రేజ్ ఉన్నవాడు. రామ్ గోపాల్ వర్మ ఇన్సి స్పిరేషన్ గా ఇండస్ట్రీకి వచ్చిన అతను వర్మలానే ఎన్నో సంచలన చిత్రాలు రూపొందించాడు. మాస్ హీరో మీనింగ్ నే మార్చివేసిన దర్శకుడుగా పూరీని చెప్పొచ్చు. పూరీకి ముందు వరకూ మన హీరోలంతా రాముడు మంచి బాలుడు టైప్ లు. కానీ అతను వచ్చాక, ఇడియట్, పోకిరి, రోగ్ లు కూడా హీరోలయ్యారు. జనం కూడా ఆదరించారు. అందుకే అతని రూట్ సపరేట్ అంటారు. అయితే కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డ పూరీ ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. లైగర్(వర్కింగ్ టైటిల్) అనే టైటిల్ తో రూపొందే ఈ మూవీ ప్యాన్ ఇండియన్ లెవెల్లో విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ కూడా వీరికి బ్యాక్ ఎండ్ గా ఉండటంతో పూరీకి మరింత సులువు అయింది. పూరీ స్టైల్లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కంటెంట్ పరంగా ఈ చిత్రం ఎక్కువ భాగం ముంబైలో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది.

అందుకే మూడు నెలల క్రితమే పూరీ టీమ్ ముంబైలో పాగా వేసింది. ఈ లోగా కరోనా వచ్చింది. అయితే అందరూ ఎవరింటికి వాళ్లు వెళ్లారు. కానీ పూరీ మాత్రం ముంబైలోనే ఆగిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్ రావడానికి అవకాశం ఉన్నా.. ఎందుకో అతను ముంబైలోనే ఆగిపోయాడు. పైగా ఆయన ఫ్యామిలీ హైదరాబాద్ లోనే ఉంది. అయినా పూరీ ముంబైనే అంతలా ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలియదు కానీ.. ప్రస్తుతం ముంబైలో కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో అస్సలు షూటింగ్ చేసే పరిస్థితి లేదు. అందుకే కొన్నాళ్ల క్రితం కథలో మార్పులు చేసి హైదరాబాద్ లోనే ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తారు అన్నారు. కానీ ఆయన ‘నిర్మాణ భాగస్వామి’ ఛార్మీ మాత్రం కథలో ఏ మార్పులూ లేవని కొట్టిపారేసింది. మొత్తంగా పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలోనే చాలా కంఫర్ట్ గా తన ఆఫీస్ పనులు చూసుకుంటున్నాడట. అలాగే తన ఆఫీస్ లోకి కొత్తవాళ్లు ఎంటర్ కావడానికీ లేదట. ఒకవేళ వచ్చినా మళ్లీ వెళ్లడానికీ చాలా తతంగాలు ఉన్నాయంటున్నారు. ఏదేమైనా పూరీ ప్రస్తుతం ముంబై ప్రియుడు అయ్యాడన్నమాట.

tollywood news