puri vijay movie
బ్యాంకాక్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పూరీ జగన్నాథే. దర్శకుడుగా అతను చాలాకాలంగా అక్కడికే వెళ్లి కథలు రాసుకుంటున్నాడు. అందుకు అతను ప్రైవసీని కారణంగా చూపించినా అసలు మేటర్ మసాజ్ లే అంటారు కొందరు. ఏదేమైనా బ్యాంకాక్ లో పూరీ జగన్నాథ్ ను గుర్తుపట్టేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఓ సినిమాలో అక్కడ తనకు పరిచయమైన కొందరితో యాక్టింగ్ కూడా చేయించాడు. అందుకే పూరీ అన్నా కూడా వెంటనే బ్యాంకాక్ గుర్తొస్తుంది. ఆ మధ్య అతని బర్త్ డే రోజు విష్ చేసిన చిరంజీవి కూడా ఏకంగా బ్యాంకాక్ ను మిస్ అవుతున్నావా అన్నాడు. అలాంటి చోటుకు తన హీరో విజయ్ దేవరకొండను కూడా తీసుకువెళుతున్నాడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ – పూరీ కాంబోలో ఓ సినిమా రూపొందుతోంది. ఫైటర్ అనే టైటిల్ అనుకున్నా ఇది మారుస్తారని చెబుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాత. అతను ఎంటర్ అయిన తర్వాత ప్రాజెక్ట్ కాస్తా ప్యాన్ ఇండియన్ సినిమా అయింది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టబోతోంది టీమ్. ఇప్పటికే విజయ్ దేవరకొండ తన పాత షేప్ కోసం వర్కవుట్స్ కూడా చేస్తున్నాడు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెబుతోన్న ఈ చిత్రంలో మేజర్ పార్ట్ ను ముంబైలోనే చిత్రీకరించబోతున్నారు. ఆ తర్వాత కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం టీమ్ అంతా బ్యాంకాక్ వెళుతుందట. అక్కడ థాయ్ లాండ్ లో కొన్ని యాక్షన్ పార్ట్స్ ను చిత్రీకరిస్తారని టాక్. ఇంతకు ముందు పూరీ .. రామ్ చరణ్ హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిరుత సినిమాలోని థాయ్ లాండ్ ఫైట్ ఎంత హైలెట్ గా నిలిచిందో అందరికీ తెలుసు. ఈ సారి అంతకు మించి అనేలా ఉంటుందట. వీటికోసమే గతంలో విజయ్ కూడా అక్కడికే వెళ్లి కొన్ని మార్షల్ ఆర్ట్స్ లో ట్రెయినింగ్ తీసుకున్నాడు. మొత్తంగా ఈ షూటింగ్ మొదలు కావడమే ఆలస్యం.. ఆ తర్వాత జెట్ స్పీడ్ తో పూర్తి చేసి సమ్మర్ వరకూ విడుదలకు రెడీ అవుతారట. మరి ఈ సారి బ్యాంకాక్ లో విజయ్ కి పూరీ ఏం చూపిస్తాడో.. ఏం చేయిస్తాడో..