దుకాణం మూసేసిన పూరీ జగన్నాథ్

puri will settle in Hyd

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పాండమిక్ సిట్యుయేషన్ లో ఇప్పటి వరకూ వేసుకున్న షెడ్యూల్స్, ప్లాన్స్, ఎస్టిమేషన్స్ అన్నీ మారిపోతున్నది ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే. మొన్నటి వరకూ తమ సినిమాల షూటింగ్ ల నుంచి రిలీజ్ ల వరకూ గ్రాండ్ గా ఊహించుకున్న మూవీ ఇండస్ట్రీ ఇప్పుడు అన్నీ మార్చేసుకుంటోంది. ఇంకా చెబితే సంపన్నులైన నిర్మాతలు తప్ప సాధారణ నిర్మాతలు ఇక సినిమాలు నిర్మించే పరిస్థితి లేనే లేదు. ఒకవేళ ఉన్నా.. బడ్జెట్ విషయంలో ఎన్నో విషయాల్లో ఖచ్చితమైన అంచనా ఉంటే తప్ప సాధ్యం కాదు. అయితే సంపన్నులైన నిర్మాతలు దొరికినా.. ఇప్పుడు ముంబై నుంచి హైదరాబాద్ కు మకాం మార్చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. ప్రస్తుతం పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమైంది. షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం అందర్లాగే ఆగిపోయింది.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను ప్యాన్ ఇండియన్ లెవెల్లో విడుదల చేయాలనుకున్నారు. అందుకు కరణ్ జోహార్ వంటి నిర్మాత కూడా బ్యాక్ ఎండ్ గా నిలవడంతో విజయ్ దేవరకొండకు ఈ సినిమా అత్యంత కీలకం అవుతుంది అనుకున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం ముంబైలోనే మకాం వేశాడు పూరీ. తన టీమ్ అంతా అక్కడే సెటిల్ అయింది. కానీ ఇప్పుడు సీన్ మారింది కదా. మళ్లీ హైదరాబాదే సో బెటరూ అనుకుంటున్నారు. మహరాష్ట్రలో ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. వచ్చే రెండు నెలల్లో లాక్ డౌన్ ఎత్తేసినా అక్కడ షూటింగ్స్ చేయడం అంత సేఫ్ కాదు. అందుకే పూర్తిగా హైదరాబాద్ పరిసరాల్లోనే షూటింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడట పూరీ. అందుకే ఇప్పటి వరకూ ముంబైలో జరిగిన షూటింగ్ పార్ట్ లో మిగిలిన భాగాన్ని ఇక్కడ మ్యాచ్ చేస్తూ కొన్ని అడ్జెస్ట్ మెంట్స్ సెట్ చేసుకున్నాడట. ఇక మిగతా షెడ్యూల్స్ అన్నీ ఇక్కడే రామోజీ ఫిల్మ్ సిటీలో చేయాలనుకుంటున్నారు. దీనివల్ల నిర్మాతలు కూడా చాలా వరకూ సేఫ్ అవుతారు. ఇక కంటెంట్ యూనిక్ గా ఉంటే వీళ్లు అనుకున్న ప్యాన్ ఇండియన్ రేంజ్ కూడా మారదు. మొత్తంగా పూరీ జగన్నాథ్ ముంబైలో దుకాణం మూసేశాడనే చెప్పాలి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *