రాచకొండలో చైతు, ఆదిలాబాద్ లో బన్నీ

4
Pushpa and Love story team 
Pushpa and Love story team 

Pushpa and Love story team

లాక్ డౌన్ ఎత్తేయడం, సినిమా షుటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ తెలుగు సినిమాలు సెట్స్ పైకి వెళ్తున్నాయి. షూటింగ్స్ లో భాగంగా లవ్ స్టోరీ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సాయి పల్లవి రాచకొండ గుట్టల్లో, ఆదిలాబాద్ లో అల్లు అర్జున్ సందడి చేశారు. వివరాల్లోకి వెళ్తే…

డైరెక్టర్ శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ సినిమా  సన్నివేశాలు రాచకొండ గుట్టల్లో షూటింగ్ జరుపుకున్నాయి. రాచకొండ సమీపంలో బోడకొండ వాటర్‌ పాల్స్‌ వద్ద నాగ చైతన్య – సాయి పల్లవీ ఆడుతున్నట్లు సన్నివేశాలను, అలాగే గుట్టల్లో బైక్‌పై విహరిస్తున్నట్లు చిత్రీకరించారు. ప్రేమకు సంబంధించి సన్నివేశాలు ఇక్కడే తీశారు. దీంతో అభిమానులు చుట్టుపక్కల జనాలతో  ఆ ఫ్రాంతమంతా సందడిగా మారింది.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం ఆదిలాబాద్ లో సందడి చేశారు. స్నేహితులతో కలిసి ఆదిలాబాద్ వాటర్ ఫాల్స్ చూసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ కు సమీపంలోని హరితవనంలో ఒక మొక్క కూడా నాటారు. బన్నీ వచ్చాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనను చుట్టుముట్టారు. ఫొటోలు  తీసుకొని మురిసిపోయారు. పుష్ప మూవీ కోసం చింపిరిజుట్టు, గుబురుగడ్డంతో కనిపించి ఆశ్యర్యపర్చాడు. బన్నీ షూటింగ్ లో భాగంగా ఆదిలాబాద్ ను విజిట్ చేశాడా? లేక వాటర్ ఫాల్స్ చూసేందుకు వచ్చాడనేది తెలియదు. ఎర్ర చందనం నేపథ్యం కాబట్టి ఆదిలాబాద్ లో షూటింగ్ జరుగుతుందేమోనని అక్కడివాళ్లు అంటున్నారు.