వ్యభిచారిణికి కరోనా.. క్యారెంటైన్ కు పోలీస్ లు 

quarantine to TN police
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది అన్నట్టుగా మారింది తమిళనాడులోని ఈ కొత్త వ్యవహారం. ఒక కుటుంబంలోని కొందరు వ్యక్తులు భర్త చనిపోయిన, లేదా వదిలేసిన మహిళలను టార్గెట్ చేసుకుని రకరకాల మార్గాల్లో వారిని బెదిరించి, లేదా డబ్బు ఆశ చూపించి వ్యభిచార రొంపిలోకి దించారు. దీనివల్ల ఆ కుటుంబం చాలా బాగుపడిపోయింది. అతి తక్కువ టైమ్ లోనే లక్షాధికారులుగా మారారు. అయితే ఈ వ్యవహారంలో సదరు ఫ్యామిలీ మెంబర్స్ ఆ మహిళలను మరింత బెదిరించడం మొదలుపెట్టారు.దీంతో వారు ఎదురు తిరిగి పోలీస్ లకు కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలో దిగారు పోలీస్ లు. కట్ చేస్తే వీళ్లు ఆ మహిళలతో వ్యభిచారం చేయించడానికి ఆ ఇంటి కోడలునే ఉపయోగిస్తూ.. సదరు మహిళలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ తీశారు. వాటిని చూపించే ఆ మహిళలను బెదిరించి వ్యభిచార రొంపిలోకి దించారు. ఈ వేధింపులు తట్టుకోలేక పోలీస్ లకు కంప్లైంట్ చేశారు కొందరు వ్యభిచార మహిళలు. పోలీస్ ల ఎంక్వైరీలోనే ఇదంతా తేలింది. అయితే వీరిని పరీక్షించిన పోలీస్ లకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
పోలీస్ ల సంరక్షణలో ఉన్న ఆ మహిళలను పరీక్షిస్తే వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ సోకింది. దీంతో వారిని తీసుకువచ్చి.. హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్ వరకూ తిప్పిన పోలీస్ లను కూడా హోమ్ క్వారంటైన్ చేస్తూ ఆదేశాలిచ్చారు. పాపం వారు డ్యూటీ చేశారు. కానీ అనుకోకుండా కరోనా బారిన పడాల్సి వచ్చింది. మొత్తం 25మంది పోలీస్ లను హోమ్ క్వారంటైన్ చేశారట. అయితే ఇప్పటి వరకూ సదరు మహిళలు ఎవరెవరితో వ్యభిచారం చేశారు అనే కోణంలో మరింతమంది పోలీస్ లు దర్యాప్తులోకి దిగారు. మొత్తంగా మన రాష్ట్రంలో కూడా ఓ వ్యభిచారిణి ద్వారా సూర్యపేటలో చాలా పాజిటివ్ కేస్ లు వచ్చాయి. వారిని పట్టుకుని కనిపెట్టేసరికి పోలీస్ లకు తల ప్రాణం తోకకు వచ్చింది. మరి ఈ తమిళనాడు వ్యవహారంలో ఇంకెంతమంది దొరుకుతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *