రావికొండలరావు ఇక లేరు

RaaviKondalRao Is No More

టాలీవుడ్‌ ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు తుదిశ్వాస విడిచారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంత కాలంగా హుద్రోగ సమస్యలతో ఆయన బాధపతున్నట్లు సమాచారం. 1958లో శోభ చిత్రంతో కొండలరావు సినీ ప్రస్థానం మొదలైంది. బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు మరణం పట్ల ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ ప్రముఖుడిగా, దర్శకుడుగా, నాటక రచయితగా, నాటక ప్రయోక్తగా, జర్నలిస్టుగా ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా అనేక చిత్రాల్లో నటించిన రావి కొండలరావు గారు తెలుగు సినీ ప్రేక్షకులకు శాశ్వతంగా గుర్తుండిపోతారని అన్నారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయినట్లైందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

#Rip RaaviKondalRao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *