ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేద్దాం

Spread the love

RADHA JOINS IN TDP

  • వంగవీటి రాధాకృష్ణ పిలుపు
  • చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక

రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేద్దామనే నినాదంతోనే ముందుకెళ్దామని విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఆయన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాధాకు సీఎం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు సంధించారు. రాజ్యాలున్నాయి పరిపాలిద్దామనే ఆరాటం జగన్ ది కాగా.. ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం టీడీపీది అని వ్యాఖ్యానించారు. ప్రజలు ఈసారి కూడా జగన్ కు ప్రతిపక్ష హోదా కట్టబెట్టడం ఖాయమన్నారు. వెన్నుపోటులు గురించి జగన్‌ మాట్లాడుతుంటారని..  తమ్ముడు అంటూ తనకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్‌.. వారితో, వీరితో అందరితో కలుస్తూ ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. కాగా, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వైఎస్సార్ సీపీ నేత యడం బాలాజీ కూడా టీడీపీలో చేరారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *