ద‌ర్శ‌కేంద్రుడి కుమారుడి మ‌రో ప్ర‌య‌త్నం!

Spread the love

RAGHAVENDRA RAO SON PRAKASH NEW MOVIE

కె. రాఘ‌వేంద్ర‌రావు… ప‌రిచ‌యం అవ‌స‌రం లేని తెలుగు సినీ ద‌ర్శ‌క దిగ్గ‌జం. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంటే ఆయ‌న కెరాఫ్ అడ్ర‌స్‌. ద‌ర్శ‌కేంద్రుడిగా పేరొందిన రాఘ‌వేంద్ర‌రావు… త‌న ప్ర‌కాష్ ని మొద‌ట యాక్ట‌ర్ ని చేద్దామ‌నే అనుకున్నారు. ఉషా కిర‌ణ్ మూవీస్ లో… నీతో అనే సిసిమా చేశారు. అది న‌టుడిగా ప్ర‌కాష్ కి ఏమాత్ర‌మూ గుర్తింపు తెచ్చిపెట్ట‌లేదు. దాంతో, ఇక నట‌న‌కు గుడ్ బై చెప్పేసి ద‌ర్శ‌క‌త్వం మీద ఆస‌క్తి పెంచుకున్నాడు ప్ర‌కాష్‌. అయితే, అక్క‌డ కూడా ఆశించిన స్థాయి స‌క్సెస్ ప్ర‌కాష్ కి ద‌క్క‌లేదు.

అన‌గ‌న‌గా ఒక ధీరుడు అంటూ అప్ప‌ట్లో ఓ సినిమా వ‌చ్చింది గుర్తుందా..? ఆ సినిమా సాంకేతికంగా ఫ‌ర్వాలేదు అనిపించుకున్నా, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన స్థాయి విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఆ త‌రువాత‌, చాలా గ్యాప్ తీసుకుని… సైజ్ జీరో అంటూ మ‌రో సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ప్ర‌కాష్‌. ఈ సినిమా కోసం అనుష్క అనూహ్యంగా బ‌రువు పెరిగి మ‌రీ న‌టించింది. అయినాస‌రే, పాస్ మార్కులు సాధించ‌లేక‌పోయింది. ఆ త‌రువాత‌, హిందీలో జ‌డ్జిమెంట‌ల్ హే క్యా అంటూ తాజాగా ఓ సినిమాకి డైరెక్ట్ చేశాడు. కంగ‌నా ర‌నౌత్, రాజ్ కుమార్ రావులు న‌టించారు. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. ఆ సినిమా త‌రువాత‌… ఇప్పుడు తెలుగులో మ‌రో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు ప్ర‌కాష్‌. ద‌ర్శ‌కుడు క్రిష్ నిర్మిస్తున్న సినిమాలో ఓ మూడు ప్రేమ‌క‌థ‌లుంటాయ‌ట‌! వాటిలో ప్ర‌ముఖ స‌న్నివేశాల‌కు ప్ర‌కాష్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఇది క‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంద‌నీ, ద‌ర్శ‌కుడిగా ద‌ర్శ‌కేంద్రుడి కుమారుడు స‌క్సెస్ కొడ‌తార‌న్న ఆశ‌లున్నాయి.

TOLLYWOOD NEW MOVIES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *