RaghuRama Seeks Court Intervention
గత కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి సెగలు పుట్టిస్తున్న వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు కథ కొత్త మలుపు తిరిగింది. వైకాపా పార్టీ తరఫున పోటీ చేసిన గెలిచిన ఎంపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలుసుకున్న పార్టీ అతనిపై అనర్హత వేటు వేసి లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ ఇదివరకే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎంపీ తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని శుక్రవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.
* వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన వైఖరీని కోర్టుకు స్పష్టం చేశారు. తను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున ఎన్నికైనందున ఈ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదని కొత్త వాదనకు తెరలేపారు. ప్రస్తుతం కొవిడ్ దృష్ట్యా అత్యవసర కేసుల్ని మాత్రమే హైకోర్టు విచారిస్తున్నది. ఈ క్రమంలో సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉన్నది.
RaghuRamaKrishnam Raju Updates