సామాన్యుడిలా థియేటర్ లో పాప్ కార్న్ తింటూ సినిమా చూసిన రాహుల్ గాంధీ

Spread the love

Rahul gandhi Became Common Man

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 542 లోక్‌ సభ స్థానాలకు గానూ కేవలం 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది లోక్ సభలో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.రాహుల్ గాంధీ కూడా అమేథీలో ఓడిపోయారు. పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరుపొందిన 90 ఏళ్ల మోతీలాల్ వోరా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఇప్పుడు రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన రోజు రాహుల్ గాంధీ రిలాక్స్ అయ్యారు.బుధవారం(జులై-3,2019) అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొంటూ ట్విట్టర్ లో నాలుగు పేజీల లేఖను షేర్ చేసిన రాహుల్ అదే రోజు సాయంత్రం సామాన్య పౌరుడిలా ఇటీవల రిలీజ్ అయిన ఆర్టికల్ 15 సినిమా చూశారు.

ఢిల్లీలోని పీవీఆర్ చాణక్య మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని.. పాప్‌కార్న్ తింటూ రాహుల్ ఆ మూవీని చూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సాధారణ వ్యక్తిలా సినిమా చూసిన రాహుల్ ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.మీరు సింప్లీ సూపర్ సార్ అంటూ ప్రశంసిస్తున్నారు.మరో ఐదేళ్ల వరకు మీరు ఇలానే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *