భారీ ర్యాలీ మధ్య అమేధీలో రాహుల్ నామినేషన్ దాఖలు

Rahul nominated in Amethi among heavy rallies

దేశంలో ఎన్నికల హడావిడి నెలకొంది .ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి తన మొదటి పార్లమెంట్ నియోజకవర్గం అమేధిలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో తన తల్లి ,యూపిఏ చైర్ పర్సన్ అయిన సోనియా గాంధి, చెల్లెలు ప్రియాంక వాద్ర వెంటఉన్నారు.అంతకు ముందు మూడు కిలోమేటర్ల మేర ర్యాలి కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది.
మూడు కిలోమిటర్ల భారీ ర్యాలీ మధ్య నాల్గవసారి ఉత్తర ప్రదేశ్ లోని అమేధి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి తన నామినేషన్ ను ధాఖలు చేశారు. కాగా నామినేషన్ సమయంలో రాహుల్ గాంధి వెంట ఆయన తల్లి యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధి సోదరి ప్రియాంక గాంధి వాద్ర,బావ రాబర్ట్ వాద్ర ఉన్నారు. నామినేషన్ ముందు పెద్దెఎత్తున్న ర్యాలి నిర్వహించారు. కాగా ర్యాలీ మున్షిగంజ్ -దర్పిపూర్ నుండి గౌరిగంజ్ వరకు మూడు కిలోమీటర్ల మేర కొనసాగిన కార్యకర్తల ర్యాలిని ఆయన ప్రారంభించారు. ర్యాలీలో రాహుల్ గాంధితో పాటు ప్రియాంక గాంధి, ఆమే భర్త రాబర్ట్ వాద్ర, ప్రియాంక కూతురు మరియా, కొడుకు రెహన్ సైతం పాల్గోన్నారు. కాగా ర్యాలి సమయంలోనే, రాహుల్ నామినేషన్ కు ముందు సోనియా గాంధి అమేథి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *