నిండా మునిగిన హైదరాబాద్

Rain Effect on Hyderabad

హైదరాబాద్ అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు, వీధులు నీటిమయమయ్యాయి. సిటీ ప్రజలు బిక్కుబిక్కుమంటు గడిపారు. జల్లులతో తడుస్తున్న నగరంలో ఒక్కసారిగా  వర్షం విధ్వంసం ప్రదర్శించింది. దానికి పెనుగాలులు తోడయ్యాయి. ‘జల’ ప్రళయం కనిపించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో, భారీ ఈదురుగాలులతో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు వర్షం దంచికొట్టింది.

పలు ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, ఖైరతాబాద్‌, టోలీచౌకీ, ముషీరాబాద్‌, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో రోడ్లపై దారి కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వచ్చింది. వాయుగుండం ప్రభావంతో రాజేంద్రనగర్‌, ఉప్పల్‌, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, నాగోల్‌, ఎల్‌బీనగర్‌లో వందలాది నివాసగృహాలు నీటమునిగాయి. ఇంకా రెండు రోజులు వర్షాలు ఉండటంతో హైదరాబాద్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షాల కారణంగా కేవలం హైదరాబాద్ లోనే పది మంది చనిపోయారు. వర్షాలు ఇలా కొనసాగితే ప్రాణ, ధన నష్టం జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *