ఎక్కడికక్కడ నిలదీతలు – సందిగ్ధంలో టీఆర్ఎస్

Rain effect on TRS government

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ సిటీ అతాలకుతలమైంది. దాంతో పరామర్శకు వెళ్లిన నాయకులు, ప్రజాప్రతినిధులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మంత్రులు వెళ్లిన చోటల్లా ప్రజలు స్థానిక కార్పొరేటర్లు ఎక్కడ అంటూ నిలదీయడం కనిపిస్తోంది. తమ సమస్యలను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. దందాలు తప్పా సమస్యలను పరిష్కరించలేదని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. కబ్జాలు, ఆక్రమణలను అడ్డుకోలేదనీ, నాలాల వెడల్పు, పూడికతీత వంటి సమస్యలు గాలికి వదిలేశారనీ విమర్శిస్తున్నారు.

హయత్ నగర్ కార్పొరేటర్ పై ముంపు భాదితులు ఏకంగా దాడికే దిగడం ప్రజల ఆగ్రహానికి అద్దం పడుతోంది. అక్కడ ఒక్కచోటే కాకుండా.. నగరంలో చాలాచోట్ల సిట్టింగ్ కార్పొరేటర్ల పట్ల ప్రజలు మండి పడుతున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకుని తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజల వద్దకు వెళ్లాలంటేనే నాయకులు, మంత్రులు, కార్పొరేటర్లు భయపడిపోతున్నారు. ఎన్నికల ముంగిట వచ్చిన వరదలు తమ కొంప ముంచుతున్నాయని సిట్టింగ్‌లు తెగ బాధపడిపోతున్నారట. మరోమారు టిక్కెట్ దక్కకుండా చేసే ప్రమాదంలోకి నెట్టాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా వరదలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై బాగా ఎఫెక్ట్ చూపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *