రైతుల బతుకుకు జగన్ భరోసా

Spread the love

raithu bharosa started in ap

ఏపీలో నవరత్నాల అమలులో భాగంగా వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఈ  కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ పథకం వల్ల 50 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. కౌలు రైతులు సైతం మూడు లక్షల మందికి భరోసా అందించనుంది. ఇక ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్  ఈ సందర్భంగా  మాట్లాడుతూ, గత ఐదేళ్లలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోయారని రాష్ట్రమంతా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయని… రైతులను దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించారని అన్నారు. పదేళ్ల తర్వాత రిజర్వాయర్లన్నీ నీటికుండలుగా మారాయని తెలిపారు. దేశంలోనే ఒక గొప్ప పథకాన్ని ఈరోజు ప్రారంభించామని… ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత ఎక్కువ పెట్టుబడి సాయాన్ని ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తామని చెప్పారు. తన పాదయాత్రలో రైతుల ఆవేదనను చూశానని పేర్కొన్నారు. రైతులకు సాయం చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చానని చెప్పారు. తాను సీఎం ను కాదు సేవకుడిని అని పేర్కొన్నారు.

tags : raithu bharosa, nellore district, inauguration, ycp government , farmers

జగ్గారెడ్డి అరెస్ట్ తో ఉద్రిక్తత 

ఆర్టీసీ కార్మికులతో చర్చలకు వెళ్లాలని  హైకోర్టు ఆదేశం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *