జక్కన్న స్కెచ్ మాములుగా లేదుగా…

Rajamouli talks with Hollywood

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి మరో సెన్సేషన్ కి తెరలేపుతున్నారు. బాహుబలి తర్వాత అయన నుంచి వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. టాలీవుడ్ టాప్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టార్రర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మరియు హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా బట్, హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా 400 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూలైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ పాన్ ఇండియా మూవీ గురించి మరో వార్త బయటకు వచ్చింది. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా రుచిని ప్రపంచానికి పరిచయం చేసిన జక్కన్న అదే రేంజ్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమాని కూడా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా.. అయన పెద్ద స్కెచ్ తోనే ఉన్నారట. పది భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ మేరకు హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల‌తో రాజ‌మౌళి చ‌ర్చ‌లు జరుపుతున్నార‌ని టాక్‌. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ సినిమాని జక్కన్న చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాకు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు తోడైతే ఇక తెలుగు సినిమా స్థాయి కచ్చితంగా ప్రపంచం ముందుంటుందనడంలో సందేహమే లేదు.

Rajamouli talks with Hollywood,Baahubali director SS Rajamouli,RRR Movie Latest News,Rajamouli With Hollywood,NTR,Ram Charan,Jakkanna,DVV Danayya

Related posts:

మహేష్ ఫ్యాన్స్ సందడేదీ
చిరంజీవి బర్త్ డే రోజు స్పెషల్ సర్ ప్రైజ్
ఖైదీ దర్శకుడిని లాక్ చేసిన తెలుగు నిర్మాతలు
మెగా ఫ్యామిలీని ‘అల్లు’కుంటున్నాడా?
తెలుగు సినిమాలో ఝాన్వీ కపూర్
ఊగిసలాడుతోన్న చిరంజీవి సినిమా
 అల్లు అర్జున్ - కొరటాల సినిమా కన్ఫార్మ్
పూజాహెగ్డేకు సినిమా పరిశ్రమపై బాధ్యత లేదా..?
నిఖిల్ హీరోగా ఏసియన్ గ్రూప్ భారీ సినిమా
కంగ్రాట్యులేషన్స్ జెర్సీ మూవీ టీమ్..
అల్లు అర్జున్ మళ్లీ సంక్రాంతినే టార్గెట్ చేశాడు
ఎన్టీఆర్ కోసం మహేష్ బ్యూటీని అడుగుతున్నారా..?
రియల్ హీరో.. ‘బ్రదర్ ఆఫ్ ద నేషన్’ సోనూసూద్
నాగార్జునతో కూడా యాక్షన్ ఎంటర్టైనరే
టాలీవుడ్ అంతా అదే కదా..?  ఇలియానా అన్నది తప్పా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *