ఎన్టీఆర్ ను ఇబ్బంది పెడుతోన్న రాజమౌళి?

Rajamouli troubles NTR?

మల్టీస్టారర్ అంటే మాటలు కాదు.. అని ఊరికే అనరు. పెద్ద స్టార్స్ తో  చేస్తే ఇమేజ్ లను బ్యాలన్స్ చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. అయితే దర్శకుడు కూడా స్టార్ అయితే ఆ బాధ కొంత వరకూ తప్పుతుంది. ప్రస్తుతం కంట్రీ మొత్తం ఫేమ్ సంపాదించిన రాజమౌళి టాలీవుడ్ టాప్ స్టార్స్ తో చేస్తోన్న రౌద్రరణ రుధిరం కూడా అందరి అటెన్షన్ ను డ్రా చేసింది. కానీ ఊహించినంత వేగంగా షూటింగ్ మాత్రం సాగలేదు. లాక్ డౌన్ కు ముందే సినిమాను వచ్చే యేడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ చేస్తున్నాం అని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఉసూరుమన్నారు. మొత్తంగా రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన వీడియో అతని ఫ్యాన్స్ తో పాటు వాయిస్ కారణంగా ఎన్టీఆర్ అభిమానులను సైతం ఆకట్టుకుంది. మళ్లీ ఎన్టీఆర్ బర్త్ డే కు ఆ రేంజ్ టీజర్ రెడీ చేయలేకపోయింది టీమ్. ఇదే టైమ్ లో లాక్ డౌన్ రావడం వల్లే కుదరలేదని రాజమౌళి చెప్పాడు. మొత్తంగా లాక్ డౌన్ ముగింపు దశకు వచ్చింది. షూటింగ్ లకు సైతం షరతులతో కూడిన పర్మిషన్స్ వచ్చాయి. రీసెంట్ గా రాజమౌళి కూడా ఓ ‘మాక్ షూటింగ్ ’ చేయాలనుకుని విరమించుకున్నాడు. మొత్తంగా త్వరలోనే ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి వెళ్లబోతోంది.

అయితే ఇక్కడా మరో కొత్త చిక్కొచ్చింది రాజమౌళికి. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే ముందుగా ఎవరి పార్ట్ చిత్రీకరించాలి అనేదే కొత్త చిక్కు. ఇప్పటికే ఎన్టీఆర్ ను యేడాదిన్నకు పైగా ఆర్ఆర్ఆర్ పేరుతో ఆడియన్స్ కు దూరం చేశాడు. అటు రామ్ చరణ్ కాస్త నయం. మధ్యలో వినయవిధేయ రామతో ఫ్యాన్స్ ను పలకరించాడు. తర్వాత ఆచార్య కూడా ఆర్ఆర్ఆర్ కంటే ముందే వస్తుంది. అందువల్ల ఎన్టీఆర్ తోనే నెక్ట్స్ షూటింగ్ అనుకుంటారేమో.. కానీ కాదట. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే ముందుగా రామ్ చరణ్ పార్ట్ నే పూర్తి చేస్తాడట. కాంబినేషన్ సీన్స్ గురించి తర్వాత ఆలోచిస్తారని సమాచారం. అయితే చరణ్ పార్ట్ ను ఎందుకు చిత్రీకరిస్తున్నారు అంటే.. ఇది పూర్తయిన వెంటే రామ్ చరణ్ ‘ఆచార్య’షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. అతను ఆచార్య ముగించేందుకు టైమ్ పడుతుంది. ఆ తర్వాత మెగాస్టార్ ఎంట్రీ ఇస్తాడు. మరి ఇటు రామ్ చరణ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయాలి కదా అనుకుంటున్నారు కదూ.. కానీ ఎన్టీఆర్ ఎలాగూ తన మాట వింటాడు అనే ధైర్యంతోనే అతన్ని ఇబ్బంది పెడుతున్నాడటంటున్నారు. ఏదేమైనా ఇది ఇద్దరు హీరోల అభిమానుల మనోభావాలకూ సంబంధించిన మేటర్. ఇలాంటివి మళ్లీ మళ్లీ రిపీట్ అయితే సోషల్ మీడియాలో ఆయా హీరోల అభిమానుల చేతిలో పోస్టులు తప్పవేమో రాజమౌళీ..

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *