ర‌జ‌నీకాంత్ `ద‌ర్బార్‌`

Spread the love
Rajanikant New Movie “Dharbar”
ర‌జ‌నీకాంత్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఆయ‌న 167 సినిమా టైటిల్ పోస్ట‌ర్ నేడు రిలీజైంది. ర‌జ‌నీ, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ఈ సినిమాకు `ద‌ర్బార్‌` అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ లుక్ పోస్ట‌ర్‌లో చూస్తుంటే.. పోలీస్ ఆఫీస‌ర్ అనే అర్థ‌మ‌వుతుంది. అలాగే సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంద‌ని తెలుస్తుంది. న‌య‌న‌తార‌, కీర్తి సురేష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. నివేదాథామ‌స్ ర‌జనీ కుమార్తె పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. ఈనెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *