రాజశేఖర్ ను మెప్పించిన దర్శకుడు..

5
rajasekhar new movie
rajasekhar new movie

rajasekhar new movie

ఒకప్పుడు యాంగ్రీ మేన్ గా తిరుగులేని ఇమేజ్ ఉన్న నటుడు రాజశేఖర్. కొన్నాళ్ల క్రితం తన మార్కెట్ ను లాస్ అయ్యాడు. ఇక అతని పనిఐపోయింది అనుకున్న టైమ్ లో అనూహ్యంగా గరుడవేగతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అతని ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకుని దర్శకుడు ప్రవీణ్ సత్తారు విజయం సాధించాడు. నిజానికి ఆ వయసులో ఈ సినిమా కోసం రాజశేఖర్ కూడా చాలా సాహసాలే చేశాడు. అది ఫలించే అతనికి అనుకోని సూపర్ హిట్ పడింది. ఈ మూవీ తర్వాత అతను ఇంక మళ్లీ ఫుల్ బిజీ అవుతాడు అనుకున్నారు. అనుకున్నట్టుగానే కల్కితో వచ్చాడు. బట్ ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. అప్పటి నుంచి మరో మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యలో ఒకరిద్దరు దర్శకుల పేర్లు వినిపించినా.. ఫైనల్ గా రాజశేఖర్ ను మెప్పించాడో దర్శకుడు. తొలి సినిమా ‘షో’తో రెండు జాతీయ అవార్డ్ లు సాధించి ఆ తర్వాత మిస్సమ్మ, విరోధి వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తీసిన దర్శకుడ నీలకంఠ. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ.. కమర్షియల్ గా ఎలా ఉన్నా.. విమర్శియల్ గా మెప్పించే దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు నీలకంఠ.

ముఖ్యంగా షో, విరోధి చిత్రాలు ఇఫీలో ప్రదర్శితం కావడం విశేషం. అయితే కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు నీలకంఠ. అలాంటి తను రాజశేఖర్ ను తన కథతో ఒప్పించడంతో మరో కొత్త కాంబినేషన్ రాబోతోందనేది తేలిపోయింది. వెటరన్ హీరో అయినా రాజశేఖర్ లో పస తగ్గలేదని ప్రూవ్ అయింది. మంచి కంటెంట్ ఉంటే అతను ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. మంచి నటుడుగానూ ఎప్పుడో సత్తా చాటాడు. నిజానికి నీలకంఠ ముందు రెండు సినిమాలు ప్రారంభం అయ్యి ఆగిపోయాయి. వీటిలో వీరభద్రం చౌదరితోనూ ఓ మూవీ ఓపెనింగ్ జరిగింది. అయితే నీలకంఠ విషయంలో రాజశేఖర్ పూర్తిగా నమ్మొచ్చు అనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే కొంత వరకూ ఇంటెలిజెంట్ డైరక్టర్ అనిపించుకున్న నీలకంఠ ఈ సినిమాతో సంచలనాలు సృష్టించకపోయినా.. ఆర్టిస్టులకు ఖచ్చితంగా సంతృప్తి ఉంటుంది. మరి ఈ కాంబోకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తారట.

tollywood news