రజినీ వస్తే అద్భుతమే

Spread the love
Rajinikanth Comes To Politics

రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అద్భుతమేనంటూ వ్యాఖ్యానించారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. బెయిల్ పై బయటకొచ్చిన చిదంబరం క్షణం తీరిక లేకుండ బీజేపీ శైలిపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి బీజేపీ పార్టీని విమర్శించారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మోడీ దారుణంగా మోసం చేశారంటూ మండిపడ్డ ఆయన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు అయన మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. అయన మాట్లాడుతూ… దేశంలో పేదరికమే కనిపిస్తుందని, దాదాపుగా 30 కోట్ల మంది పేదలు పూటగడవని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కేంద్రం నిర్ణయాల కారణంగా ఆర్థిక ప్రభావం అన్నది పెరిగిందని ధ్వజమెత్తారు. ఇక 5 శాతంగా ఉన్నజీఎస్టీ 8 శాతానికి, 8 శాతం 12 శాతానికి, 12 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుందని చెప్పారు చిదంబరం.

TAMILNADU POLITICS

http://tsnews.tv/pawan-kalyan-interacts-with-velagathodu-farmers/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *