RAKSHAHUDU MOVIE TRAILER LAUNCH
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా ట్రైలర్ విడుదలైంది. తమిళంలో విజయం సాధించిన రాచ్చసన్ రీమేక్ గా ఈ సినిమా తెలుగులో వస్తోంది. తాజా ట్రైలర్ చూస్తే… ఇది పక్కా థ్రిల్లర్ అని అర్థమౌతుంది. ఒక సైకో కిల్లర్, పోలీసులకు చుక్కలు చూపిస్తాడు, వాడిని పట్టుకోవడం కోసం హీరో చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో హీరో పడ్డ కష్టాలు అనేది అర్థమౌతోంది. ట్రైలర్ కట్ వరకూ చూస్తే… కొంత గ్రిప్పింగ్ గానే ఉందనే అభిప్రాయం కలుగుతుంది.
అయితే, తమిళ మాతృత ట్రైలర్ కట్… పెద్ద సంచలనమైంది. దానికి కారణం ట్రైలర్లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనడంలో సందేహం లేదు. తమిళంలో జీబ్రాన్ ఆ సినిమాకు మ్యూజిక్ చేశాడు. తెలుగులో కూడా దాదాపుగా అవే ట్రాకులు మక్కీకి మక్కీకి వాడారు. కానీ, ఎందుకో… ఆ ఎఫెక్ట్ అంత తీవ్రంగా తేలేకపోయారు అనిపిస్తుంది. ఏదేమైనా, తమిళంలో హిట్ అయిన సినిమా కాబట్టి, ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ దించేసినా ఆడుతుందనే ధీమాతో చిత్రయూనిట్ ఉంది. ట్రైలర్ కూడా కొంత ఆసక్తిని రేకెత్తించే విధంగానే ఉంది. ఇదే గ్రిప్పంగ్ ని ఫుల్ లో కూడా ఉంటే చాలు… ఈసారి, బెల్లంకొండ హిట్ తెచ్చుకోవడం ఖాయం.
http:/https://youtu.be/zhwMSTRl_nw