రాక్షసుడు దర్శకుడికి ఇది బోనసే

3
Rakshasudu director
Rakshasudu director
Rakshasudu director
వరుసగా ఫ్లాప్ లే ఇచ్చిన దర్శకడికి ఒక్క హిట్ వచ్చినా చాలు లైమ్ లైట్ లోకి వస్తాడు. అలాగే ఈ మధ్య కాలంలో కాస్త వెలుగులోకి వచ్చాడు రమేష్ వర్మ. పదిహేనేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన రమేష్ వర్మ.. అప్పటి నుంచి ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. తరుణ్, సలోని జంటగా నటించిన ఒక ఊరిలో అనే సినిమాతో దర్శకుడుగా మారిన అతను తర్వాత నాని, తనీష్ హీరోలుగా రైడ్ తో ఓ మోస్తరు విజయం అందుకున్నాడు. రవితేజతో చేసిన వీర మూవీ వీర ఫ్లాప్ గా నిలిచింది. తర్వాత జఫ్ఫా, 7 అనే సినిమాలూ నిర్మించాడు. అయితే ఏ విషయంలోనూ పెద్దగా సక్సెస్ అందుకున్నది లేదు. అయినా లాస్ట్ ఇయర్ అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ‘యధాతథం’గా అందిపుచ్చుకున్నాడు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన రాక్షసన్ ను తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. నిజం చెబితే ఈ మూవీతో అతను చూపిన కొత్త ప్రతిభ ఏం లేదు. ఒరిజినల్ సినిమాను ఫ్రేమ్ టు ఫ్రేమ్ దింపాడు. అయినా హిట్ వచ్చింది కదా. అందుకే మరో ఆఫర్ వచ్చింది. మళ్లీ మాస్ రాజా రవితేజ రమేష్ వర్మకు ఓ ఛాన్స్ ఇచ్చాడు.
దీంతో ఈ సారి ప్రూవ్ చేసుకుంటే అతను కూడా లైమ్ లైట్లోకి వస్తాడు. అయితే దీనికి ముందే అతనికి బోనస్ లాంటి మరో ఛాన్స్ వచ్చింది.  రాక్షసుడును బాలీవుడ్ లో రీమేక్ చేసే అవకాశం రమేష్ వర్మకే వచ్చింది. మామూలుగా ఇలాంటి అవకాశాలు ఒరిజినల్ తీసిన దర్శకుడికి వస్తుంటాయి.కానీ రీమేక్ డైరెక్టర్ కు మరో రీమేక్ ఛాన్స్ రావడం విశేషమే. త్వరలోనే ఈ సినిమా బాలీవుడ్ లో ప్రారంభం అవుతుంది. అయితే అక్కడ కూడా పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. పైగా విలన్ పార్ట్ లో కాంబినేషన్ లేని సీన్స్ చాలా వరకూ తెలుగులో తీయలేదు. తమిళ్ వెర్షన్ నే ఉంచారు. ఇప్పుడు హిందీలో కూడా అదే చేయొచ్చు. అలాగే రీమేక్ రైట్స్ ను కూడా తమిళ్ నుంచే కొనుగోలు చేశారు. ఏదేమైనా రమేష్ వర్మకు ఈ బాలీవుడ్ ఆఫర్ బోనస్ అనే చెప్పాలి.