ఆర్ఆర్ఆర్ లో రకుల్ ప్రీత్ సింగ్ ..?

Rakul in RRR?

ఆర్ఆర్ఆర్ .. ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ గా వస్తోన్న సినిమా. టాలీవుడ్ లో చాలాయేళ్ల తర్వాత సెట్ అయిన మాసివ్ మల్టీస్టారర్ గా రూపొందుతోన్న ఈ మూవీకి రాజమౌళి దర్శకుడు కావడంతో ఎంటైర్ కంట్రీ కూడా ఈ మూవీ కోసం ఆసక్తిగా చూస్తోంది. అయితే రకరకాల కారణాలతో ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త వచ్చే యేడాదికి పోస్ట్ పోన్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ –  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వస్తోన్న ఈ మల్టీస్టారర్ లో అలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ్ స్టార్ యాక్టర్ సముద్రఖని కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా ఈ క్రీజీయొస్ట్ ప్రాజెక్ట్ లోకి రకుల్ ప్రీత్ సింగ్ కూడా జాయిన్ అయిందనే ప్రచారం జరుగుతోంది. మామూలుగా రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్ ను ఇంత పెద్ద ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారనే వార్త చిన్నది కాదు. కానీ  రాజమౌళి స్ట్రాటజీలు ఎవరికీ అర్థం కావు. అందువల్ల ఇది అబద్ధం అనలేం. నిజమని తేల్చలేం. కానీ ఈ వార్త నేషనల్ మీడియాలో కనిపిస్తుండటం మాత్రం ఈ వార్తకు బలాన్ని తెస్తోంది.

ఆ వార్తలను బట్టి రకుల్ ఇందులో హీరోయిన్ కాదు. కానీ సినిమాలో అత్యంత కీలకంగా కనిపించే పాత్రలో ఉంటుందట. మామూలుగా ఊహిస్తే.. ఈ పాత్ర అజయ్ దేవ్ గణ్ కు పెయిర్ గా ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఆల్రెడీ అజయ్, రకుల్ కపుల్ కు బాలీవుడ్ లోనూ మంచి క్రేజే ఉంది. అందువల్ల కూడా తనో ఆప్షన్ అయి ఉండొచ్చు అనుకోవచ్చు. ఇక రకుల్ విషయానికి వస్తే తను ఆల్రెడీ భారతీయుడు -2లో ఓ కీలక పాత్ర చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో అర్జున్ కపూర్ సరసన ఓ సినిమా అజయ్ దేవ్ గణ్ తో మరో సినిమా చేస్తోంది. ఇటు తెలుగులో నితిన్ సరసన ఓ మూవీకి సైన్ చేసింది. అయితే ఈ వార్త ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కావాల్సి ఉంది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ లో రకుల్ ప్రీత్ సింగ్ అనే న్యూస్ మాత్రం బాలీవుడ్ లో కూడా హల్చల్ చేస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది .

tollywood news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *