రామ్ చరణ్ కు 30 కోట్లా..? నమ్మొచ్చా ఆచార్యా..?

ram charan wants 30 crores
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్ లోవస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఫైనల్ చేశారని చెబుతున్నారు. ముందుగా త్రిషను తీసుకున్నారు. కానీ తను క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని తప్పుకుంది. మొత్తంగా కాజల్ నే తీసుకున్నారు అనేది ఫైనల్ గా వినిపిస్తోన్న మాట. అయితే రామ్ చరణ్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముందుగా ఈ పాత్రను మహేష్ బాబుతో చేయించాలనుకున్నారు. అతను 30 కోట్లు అడిగాడు. అయితే మహేష్ కంటే చరణ్ బెటర్ అనేది చిరంజీవి వెర్షన్ దీంతో కొరటాల చరణ్ కే ఫిక్స్ అయ్యాడు. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్ ఏంటంటే.. చరణ్ కూడా తనకు 30 కోట్లు కావాలని అడుగుతున్నాడట.
అవును ఈ సినిమాకు నిర్మాత రామ్ చరణ్ అయినా తనకూ రెమ్యూనరేషన్ కావాలనుకుంటున్నాడు. అందుకోసం మ్యాట్నీ సంస్థ కూడా అంగీకరించింది అంటున్నారు. కానీ ఇందులో ఎంత నిజ ఉందీ అనేది చూస్తే ఖచ్చితంగా అంత రెమ్యూనరేషన్ రామ్ చరణ్ కు ఇవ్వడం అసాధ్యం అనుకోవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు ప్రస్తుతం 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. అతని ఇమేజ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది. ఇక్కడ కూడా తండ్రి కొడుకు కలిసి నటిస్తున్నారు అనే క్రేజ్ వర్కవుట్ అయినా తనూ నిర్మాణ భాగస్వామి కాబట్టి అంత డిమాండ్ చేయడం అసాధ్యం. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా 30 కోట్లు ఇస్తున్నారు అనే వార్తలు రావడం వెనక ఉన్న కారణం ఏంటంటే.. తనూ మహేష్ బాబు కంటే తక్కువేం కాదు అని చెప్పుకునేందుకే.. అదే టైమ్ లో తాము మహేష్ కు అంత ఇవ్వడానికి ఇష్టం లేకనేఅతనితో చేయించడం లేదు అనే టాక్ రాకుండా ఉండేందుకు. ఈ రెండు కారణాల వల్లనే రామ్ చరణ్ కూ 30కోట్ల రెమ్యూనరేషన్ అనేమాటను పదే పదే చెప్పిస్తున్నారు అనుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *