రామ్ చరణ్ పై అదో పెద్ద రూమరట

3

Ram charan with new director

మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రంగస్థలం సినిమాతో ఇప్పటి వరకూ అతన్ని అభిమానించని వాళ్లు కూడా ఫ్యాన్స్ అయ్యేంతటి అద్భుత నటన చూపించాడు. టాలీవుడ్ టాప్ ఫైవ్ లో తిరుగులేని మాస్ హీరోగా దూసుకుపోతోన్న రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి చేస్తోన్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘రౌద్ర రణ రుధిరం’తో పాటు తండ్రి మెగాస్టార్ తో కలిసి మూడోసారి(మగధీర, బ్రూస్ లీ) స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇంతకు ముందు చిరు.. చరణ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తే.. ఇప్పుడు చరణ్.. చిరు సినిమా ఆచార్యలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈచిత్రంలో చరణ్ పాత్ర చాలా బావుంటుందని ముందు నుంచీ చెబుతున్నారు. ఈ టైమ్ లో రామ్ చరణ్ పై కొన్ని రోజులుగా ఓ రూమర్ హల్చల్ చేస్తోంది.

రామ్ చరణ్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అనేదే ఆ వార్త. సతీష్ అనే ఓ కొత్త కుర్రాడు అద్భుతమైన స్క్రిప్ట్ తో చరణ్ కు నెరేట్ చేశాడనీ.. విన్న వెంటనే చరణ్ ఇంప్రెస్ అయి ఇప్పుడు చేస్తోన్న రెండు మూవీస్ అయిపోగానే అతనితోనే చేస్తాను అన్నాడనేదే ఆ వార్త. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదంటోంది మెగా క్యాంప్. అసలు ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ఎలాంటి కొత్తకథలూ.. ముఖ్యంగా కొత్తవాళ్లు చెప్పినవి వినలేదని స్పష్టం చేశారు. ఈ మధ్య కాలంలో వినిపిస్తోన్న చాలా రూమర్స్ లో  ఇదీ ఒకటనీ కొట్టి పారేస్తున్నారు. ఇక ఈ వార్త(కొన్నాళ్ల తర్వాతైనా) నిజమే అయితే మాత్రం.. చరణ్ ఫస్ట్ టైమ్ లో డెబ్యూ డైరెక్టర్ తో పనిచేసివాడు అవుతాడు. చిరుతతో కెరీర్ మొదలుపెట్టిన దగ్గర్నుంచీ రామ్ చరణ్ ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా డెబ్యూ డైరెక్టర్ తో చేయలేదు. ఇది వర్కవుట్ అయితే మాత్రం ఇదో రికార్డ్ కూడా అవుతుంది. మొత్తంగా ఇప్పటికైతే ఈ వార్త పూర్తిగా అబద్ధం అనేది మెగా క్యాంప్ నుంచి స్పష్టంగా వినిపించిన సందేశం.

tollywood news