దట్ ఈజ్ రాము…

Ram Gopal Varma Morphed KA Paul Photo

రామ్ గోపాల్ వర్మ వివాదాలకు మారు పేరు ఆయన. ఎప్పుడు సినిమా మొదలుపెడతాడో తెలియదు, ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో కూడా తెలియదు. కానీ సినిమాని థియేటర్లోకి మాత్రం తీసుకొస్తాడు దట్ ఈజ్ రాము. ఇక అయన తాజాగా తెరకెక్కించిన సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఏపీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాపై సెన్సార్ వాళ్ళు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫైనల్ గా ఆర్జీవీ సినిమాకు యు/ఏ సెర్టిఫికెట్ ఇచ్చారు. అయితే సెన్సార్ సర్టిఫికెట్ ని కూడా రామ్ గోపాల్ వర్మ వదలకపోవడం ఆశ్చర్యకరం. సెన్సార్ ఇచ్చిన సెర్టిఫికెట్ ను కేఏ పాల్ చేతులమీదుగా ఇస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ తీసుకుంటున్నట్లు విచిత్రంగా మార్ఫింగ్ చేసి బయటకు వదిలారు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో తెగ చర్చకు దారి తీసింది. దట్ ఈజ్ రామ్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Ram Gopal Varma Morphed KA Paul Photo,censor certificate of Amma Rajyam Lo Kadapa Biddalu,#KAPaul,#RamGopalVarma,Did KA Paul present censor certificate?, censor certificate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *