రాంజెఠ్మలాని ఇక లేరు

RAMJETMALANI EXPIRED

కేంద్ర మాజీమంత్రి, న్యాయ కోవిదుడు, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలాని ఇక లేరు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన గతంలో కేంద్ర మంత్రిగా, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. వాజపేయి హయాంలో కేంద్ర మంత్రి గా పని చేసిన ఆయన చాలా కాలం బీజేపీలో, ఆ తర్వాత ఆర్ జే డీలో చేరారు. దేశంలో సంచలనం స్ట్రుష్టించిన అనేక కేసులను ఆయనే వాదించారు. రాంజెఠ్మలాని కోర్టు హాల్లో అడుగుపెట్టాడంటే న్యాయమూర్తులు సైతం ఆయన వాదన చూసి ముచ్చటపడేవారు. ఆయన వాగ్దాటికి ప్రత్యర్థులు హడలిపోయేవారిని నేటికీ ఆయన గురించి తెలిసిన న్యాయవాదులు చెప్పుకుంటారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధి, సోనియా గాంధి, చంద్రబాబు నాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయ విభాగంలో ఆయన చేసిన సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు.

NATIONAL BREAKING NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *