వాడి పొగరు ఎగిరే జెండా..

8
Ramraju For Bheem
Ramraju For Bheem

Ramraju For Bheem

ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్. ఎన్టీయార్‌కు, ఆయన అభిమానులకు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మంచి గిఫ్ట్ అందించాడు. `రామరాజు ఫర్ భీమ్` వీడియోను విడుదల చేశాడు. `ఆర్ఆర్ఆర్`లో ఎన్టీయార్ పాత్ర ఎలా ఉంటుందో, కొమ్రం భీమ్ గా ఎలా ఆకట్టుకుంటాడో వాటిని ఇంట్రడ్యూస్ చేస్తూ వీడియోను విడుదల చేశారు.

`వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్` అనే డైలగ్స్ రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఎన్టీయార్ పాత్రను పరిచయం చేశారు. మన్యంవీరుడిగా ఎన్టీఆర్ అదరగొట్టాడు. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ వీడియో ఎన్టీఆర్ అభిమానులకు పండుగలాంటిదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here