#RamvilasPaswan Dead
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పాశ్వాన్ పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు.
కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పాశ్వాన్ ఢిల్లీలో టీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. వెయ్యి కార్లతో చలో ఢిల్లీ కార్యక్రమానికి దగ్గర ఉండి స్వాగతం పలికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిన పాశ్వాన్ మృతి బాధాకరమని వినోద్ కుమార్ అన్నారు. ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ అధినేత గా ఉన్న కేసీఆర్ కు సంపూర్ణ సహకారాన్ని పాశ్వాన్ అందించారని, కేసీఆర్ కు పాశ్వాన్ మంచి స్నేహితుడని వినోద్ కుమార్ తెలిపారు.
కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమానికి రామ్ విలాస్ పాశ్వాన్ మద్దతుగా నిలిచారని మంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందన్నారు.
#RamVilasPaswan Expired