‘అరణ్యం’గా రానా.. అదుర్స్  

Rana Aranyam Teaser

కొన్ని దశాబ్ధాల క్రితం ఈ తరహా సినిమాలకు మంచి క్రేజ ఉండేది. కాస్త మసాలా కూడా యాడ్ చేసి ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు కూడా వచ్చాయి. కానీ అచ్చంగా టార్జాన్ అని చెప్పలేం కానీ.. ఇప్పుడు రానా చేసిన అరణ్య కూడా ఆ తరహాలోనే కనిపిస్తుంది. రానా, విష్ణు విశాల్, శ్రీయి పిల్జోంకర్, జోయాహుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. తెలుగులో అరణ్యంగా, తమిళ్ లో కాడన్, హిందీలో హాథీ మేరే సాథీగా వస్తోన్న ఈ సినిమాలో రానా వైల్డ్  లుక్ లో కనిపిస్తున్నాడు. టీజర్ ఖచ్చితంగా అన్ని భాషల్లోనూ ఇంప్రెసివ్ టాక్ తెచ్చుకుంటోంది. అయితే ఇది ప్రధానంగా తమిళ్ సినిమా. అయినా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల కాబోతోంది.

కొన్నాళ్ల క్రితం రానా ఆరోగ్యం బాలేకపోవడం వల్ల లేట్ అయింది. లేదంటే ఇప్పటికే వచ్చి ఉండేది. అయితే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. భారీ అడవులు, జంతువులను రియలిస్టిక్ గా క్రియేట్ చేయాల్సి ఉంది. అందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన బిగ్గెస్ట్ మూవీస్ అయిన థోర్, లైఫ్ ఆఫ్ పై చిత్రాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ ప్రాణ కంపెనీయే ఈ చిత్రానికీ పనిచేస్తోంది.

మొత్తంగా అడవిని రక్షించుకునే మనిషిలా రానా లుక్ అదిరిపోతే అతనికి తోడుగా నిలిచే పాత్రలో కనిపిస్తోన్న విష్ణు విశాల్ కు సైతం మంచి పాత్రే ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఏప్రిల్ 2న భారీగా విడుదల కాబోతోన్న ఈ మూవీతో రానా ఏ స్థాయి విజయం అందుకుంటాడో చూడాలి.

Rana Aranyam Teaser,Haathi Mera Saathi Teaser ,Aranyam Telugu Movie,#RanaDaggubati.#Ranaaranyam,Tollywood News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *