రానా ప్యాన్ ఇండియన్ సినిమానా..?

Rana in Pan India movie

బాహుబలితో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు రానా. అంతకు ముందే మనోడు బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కేవలం హీరో అని మాత్రమే అనిపించుకోవాలని అనే కండీషన్స్ లేకుండా వరస సినిమాలతో మంచి దూకుడు మీదున్నాడు రానా. అతను నటించిన అరణ్యం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు బాలీవుడ్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకపశిప’మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడిప్పుడు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తయిపోయింది. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేశారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కు మరీ ఎక్కువ టైమ్ తీసుకోకుండా మంచి ప్రణాళికలు కూడా వేసుకున్నారట. మరోవైపు నెంబర్ వన్ యారీ మరో సిరీస్ ప్రారంభం కాబోతోంది. అలాగే వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘విరాట పర్వం’లో రానాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉంది. కీలకమైన క్లైమాక్స్ కూడా చిత్రీకరించాల్సి ఉంది. ఈ టైమ్ లో రానా ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

నిజానికి రానాకు ప్యాన్ ఇండియన్ లెవెల్లో గుర్తింపు ఉంది. కానీ స్టార్డమ్ లేదు. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ కు రానా తెలుసు. కానీ అతనికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ స్టార్డమ్ ఫ్యాన్స్ అంటూ లేరు అనేది నిజం. అందుకే రానా ఆ వైపుగా దృష్టిపెట్టాడు. ఓ భారీ ప్యాన్ ఇండియన్ మూవీలో హీరోగా నటించిన స్టార్డమ్ పెంచుకోవాలనుకుంటున్నాడు అనేది ఆ వార్తల సారాంశం. రానాకు ఆ ఆలోచన ఉంది కానీ అది ఎప్పుడు అనే క్లారిటీ లేదనేది వాస్తవం. గతంలో ఓ ఇంటర్వ్యూలో రానా ఈ విషయం చూచాయగా చెప్పాడు. దాన్నే హైలెట్ చేస్తూ అంతా రానా ప్యాన్ ఇండియన్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అనేది నిజం అంటున్నారా రానా క్లోజ్ సర్కిల్స్ లో ఉన్నవాళ్లు. అయితే గుణశేఖర్ తో చేస్తోన్న సినిమాను ప్యాన్ ఇండియన్ లెవెల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ కంటెంట్ ఇండియా మొత్తం వర్తిస్తుంది. కాబట్టి.. గుణశేఖర్ కాస్త జాగ్రత్తగా రూపొందిస్తే ఖచ్చితంగా ఇదైనా సరేవర్కవుట్ అవుతుందని చెప్పొచ్చు. ఏదేమైనా రానాకు ప్యాన్ ఇండియన్ లెవల్లో స్టార్డమ్ తెచ్చుకోవాలనే కోరిక మాత్రం ఉందనేది నిజం.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *