మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా రానా- మిహికా

Rana-Mihika engagement

కొన్ని రోజుల క్రితం ‘ఫైనల్లీ షీ సేస్ ఎస్’అనే ట్వీట్ తో షేక్ చేశాడు రానా.. ఇన్నాళ్లుగా తను ప్రేమలో ఉన్న విషయం ఏ ఒక్కరూ పసిగట్టకపోవడం విశేషం. అటు సినిమా సర్కిల్స్ లో సైతం రానా ట్వీట్ సంచలనం సృష్టించింది. మామూలుగా ప్లే బాయ్ తరహా ఇమేజ్ ఉన్న రానా ఇలా సీక్రెట్ గా ఓ ప్రేమకథను నడిపించడం మాత్రం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ పెళ్లి కూడా త్వరలోనే జరగబోతోంది. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే రానా తండ్రి సురేష్ బాబు కూడా ఈ విషయంలో వెనకబడే ఉన్నాడు. అంటే తనయుడి ప్రేమ తండ్రికీ తెలియదు. మొత్తంగా ఈ ప్రేమకు రెండు వైపుల పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ముంబై బ్యాక్ గ్రౌండ్ కు చెందిన మిహికా బజాజ్ ప్రేమకు ఆమె ఇంటి నుంచి కూడా ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇటు సురేష్ బాబు సైతం ఫస్ట్ డేనే ఓకే అన్నాడు.

కాబ్టటి రెండు కుటుంబాల పెద్దలు కలిసి గురువారం ‘రామానాయుడు స్టూడియోస్’లో కూర్చుని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. చాలామంది ఇది నిశ్చితార్థం అనుకున్నారు. కానీ ముందుగా పెద్దల పరిచయం కార్యక్రమం. అఫీషియల్ గా ఈ పెళ్లికి ఓకే చెప్పిన పెద్దలంతా కలిసి కలిసి పరిచయం చేసుకుని ఎంగేజ్మెంట్ తో పాటు, పెళ్లికి సబంధించిన వివరాలను గురించి చర్చించుకున్నారు. ఇక ఈ వేడుకలో రానా – మిహికాల జంటను చూసిన ఎవరైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు అనుకోవాల్సిందే. ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లోనే వెరీ సింపుల్ గా కనిపించారు. ఆ ఇద్దరి నవ్వుల్లో భవిష్యత్ కు సంబంధించిన ఓ గొప్ప గ్లో కనిపిస్తోందని చెప్పాలి. మొత్తంగా రానా- మిహికాల జంట టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో సైతం హాట్ టాపిక్ గానే ఉడటం మరో విశేషం. ఎనీవే ఈ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..

tollywood news

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *