తలసరి ఆదాయంలో రంగారెడ్డి ఫస్ట్

RANGA REDDY DISTRICT IS FIRST IN PER CAPITA INCOME

తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచింది . అదే క్రమంలో జగిత్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన రాష్ట్ర సామాజిక, ఆర్థిక నివేదిక 2019 ప్రకారం ఆయా జిల్లాలకు వివిధ స్థానాలు దక్కాయి. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 4,57,034 రూపాయలు ఉండగా.. జగిత్యాల జిల్లాలో అధమంగా 92 వేల 751 రూపాయలుగా నమోదైంది. ఇక పెద్దపల్లి జిల్లాలో 1,46,634 రూపాయలు.. కరీంనగర్ 1,28,221, రాజన్న సిరిసిల్ల 99 వేల 296 రూపాయలుగా ఉండటం గమనార్హం.తెలంగాణ ప్రభుత్వం ఆయా జిల్లాల తలసరి ఆదాయాలకు సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది. అందులో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. జగిత్యాల జిల్లా చిట్ట చివరి స్థానం దక్కించుకుంది. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం అన్ని జిల్లాల కంటే మెరుగ్గా ఉంది. 4 లక్షల 57 వేల 34 రూపాయల తలసరి ఆదాయం నమోదు చేసింది ఆ జిల్లా. ఇక చివరి స్థానంలో నిలిచిన జగిత్యాల జిల్లా తలసరి ఆదాయం 92 వేల 751 రూపాయలుగా ఉంది.
రాష్ట్ర తలసరి ఆదాయం కంటే కూడా రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఫలితాలు నమోదు చేసింది. రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 5 వేల రూపాయలు కాగా.. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 4 లక్షల 57 వేల రూపాయలుగా ఉంది. అంటే రాష్ట్రానికంటే కూడా రెట్టింపు తలసరి ఆదాయం నమోదు చేసిందన్నమాట. ఈ జిల్లా పరిధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలతో పాటు సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉండటం.. వాటిలో పనిచేసే ఉద్యోగులకు కూడా అదే స్థాయిలో జీతాలు ఉన్నాయి. అందుకే రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో టాప్ ప్లేస్ ఆక్రమించిందని చెప్పొచ్చు.రంగారెడ్డి జిల్లా టోటల్ జనాభాలో 42 శాతం మంది ఏదో ఒక పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 6 లక్షల 13 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉండగా.. వీరి తర్వాత 2 లక్షల 13 వేల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఇక రైతులు ఒక లక్షా 65 వేల మంది ఉండగా.. మరో 29 వేల 544 మంది కుటీర పరిశ్రమలపై ఆధారపడ్డారు. అదలావుంటే సాగు విషయంలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 10వ స్థానం దక్కడం గమనార్హం. ఇక అక్షరాస్యతలో 71.95 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 లక్షల 30 వేల కుటుంబాలు ఉన్నాయనేది ఒక అంచనా. అందులో 7 లక్షల 90 వేల కుటుంబాలకు వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు నివేదిక వెల్లడిస్తోంది.ఇక తలసరి ఆదాయంలో జగిత్యాల జిల్లా చివరి స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలోనే అధమంగా జిల్లా సగటు తలసరి ఆదాయం 92 వేల 751గా నమోదైంది. రాష్ట్ర తలసరి ఆదాయంతో పోలిస్తే 50 శాతానికి పైన తక్కువగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 5 వేల రూపాయలు కాగా.. జగిత్యాల జిల్లా తలసరి ఆదాయం 92,751 రూపాయలుగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన సోషల్, ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌ నివేదిక వెల్లడించింది. భూ విస్తీర్ణం, సాగు విషయంలో జిల్లా 12వ స్థానంలో నిలిచింది.

CAPITA INCOME REPORT

Tags :  Telangana Government,   Capita Income Report, Rangareddy district ,jagtial district

Related posts:

కరోనా ఎఫెక్ట్ ... వజ్రాల పరిశ్రమకు నష్టం
మీడియాకు పట్టిన కరోనా...
ఇంటర్నెట్‌ ఇక్కడే చీప్‌: కేంద్ర టెలికాం మంత్రి
శబరిమల పెప్పర్ స్ప్రే దాడిపై  సుప్రీం లో పిటీషన్
గుంటూరు డ్రగ్స్ తయారీ  ముఠా గుట్టు రట్టు
ప్రియాంకా రెడ్డి హత్య.. కేసీఆర్ స్పందన ఏదీ ?
మద్యం తాగించి.. మృతదేహాన్ని వదలకుండా పశువుల్లా  
ఒకే కుటుంబంలో ముగ్గురు కలెక్టర్లు
నేరస్తులను ఉరి తియ్యాలని డిమాండ్
అడవి జంతువులు తిరుగుతున్నాయి జాగ్రత్త..
ఏ సమయంలో అయినా 100కు  కాల్  చెయ్యండి
అలా చేస్తే ప్రియాంక రెడ్డి బ్రతికేదేమో...
ప్రియాంకా రెడ్డి హత్య కేటీఆర్ స్పందన...  
ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్... పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చిందిదే
అరెస్టు కాదు ఆహ్వానము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *