Rare combination Vijay Devarakonda with Anushka
భారీ చిత్రాలు, లేడీస్ ఓరియేంటేడ్ చిత్రాలకు పెట్టింది పేరు అనుష్క. ఇక యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఒక్కొక్కరికిది ఒక్కొ శైలి. అలాంటి వీళిద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. వినడానికి బాగానే ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో అనుకుంటున్నారా.. అయితే రేర్ కాంబినేషన్ లో త్వరలో మూవీ రానుంది. ఇటీవల స్వీటీ అనుష్క తను నటించిన ‘నిశ్శబ్దం’ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు కథలు ఫైనల్ చేశానని.. త్వరలోనే వాటి గురించి అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు.
వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకోనున్న చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని, ఇప్పటికే స్ర్కిప్ట్, ఇతరత్రా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అతి త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ను ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.